సమంత స్పెషల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెట్టింట్లో పుష్ప స్పెషల్ సాంగ్ మేనియా నడుస్తోంది. మత్తు వాయిస్‌తో ఊ అంటావా మావా.. ఊహు అంటావా అంటూ సాగే ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ పైగా దూసుకుకెళ్తుంది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు సమంత నటించిన స్పెషల్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. అంటావా మావా.. ఊహు అంటావా అంటూ మత్తు వాయిస్‌తో సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. చంద్రబోస్ లిరిక్స్.. సమంత స్టెప్పులు.. ఇంద్రావతి నిశా వాయిస్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నాయి. ముఖ్యంగా లిరిక్స్ సాంగ్ వీడియోలో సింగర్ ఇంద్రావతి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఈ పాటను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. యూట్యూబ్‌లో రికార్డ్స్ సృష్టిస్తోన్న ఈ పాటకు ఇప్పుడు మేల్ వెర్షన్ వచ్చేసింది.
మీ కళ్లల్లోనే వంకర ఉంది.. ఆడాళ్ల ముద్ధే వంకర బుద్ధి.. ఊ అంటావా పాప.. ఊహు అంటావా అంటూ సాగే మేల్ వెర్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మేల్ వెర్షన్ పాటకు సంబందించిన వీడియోను వాలి అనే ట్విట్టర్ యూజర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ పాటకు తగినట్టుగా తమ్ముడు.. అత్తారింటికి దారేది… బిల్లా… సన్నాఫ్ సత్యమూర్తి.. వేదం.. ఖైదీ నం.150 చిత్రాల్లని పలు ఫేమస్ స్టెప్పులతో క్లిప్ తయారు చేసిన వీడియో తెగ ఆకట్టుకుంటుంది. మేల్ వెర్షన్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో అల్లు అర్జున్ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటించగా.. అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తోంది.
Fun male version of #OoAntavaOoOoAntava ? #Pushpa pic.twitter.com/hIeOFjfS2s
— Vaali (@vaaalisugreeva) December 15, 2021
Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..