
కన్నడ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో’. ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇటు తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. డైరెక్టర్ హేమంత్ రావు తెరకెక్కించిన ప్రేమకథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగులో సెప్టెంబర్ 22న రిలీజ్ కాగా.. అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమా ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ముగుస్తుందని, కథనంలో తర్వాత ఏం జరుగుతుందనేది సెకండ్ పార్ట్ గా రాబోతుందని గతంలో దర్శకుడు హేమంత్‌రావు అన్నారు.
అదే విధంగా ఇప్పుడు సైడ్ బి లేదా ‘సప్త సాగరాలు దాటి’ సినిమా రెండో భాగం ట్రైలర్ను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేసింది. మొదటి భాగంలో జైలులో ఉండి ప్రేమను పోగొట్టుకున్న మను రెండో భాగంలో జైలు నుంచి విడుదలవుతాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. ‘ఒక మిడల్ క్లాస్ కొత్తగా పెళ్లైన జంట చిన్న జాబ్స్ చేసుకుంటూ సిటీలో బతుకుతుంటారు. ఎవరో చేసిన యాక్సిడెంట్ కేసును డబ్బుల కోసం తన మీద వేసుకుని జైలుకు వెళతాడు హీరో. కానీ అనుహ్యంగా అతను పదేళ్లు జైలులో ఉండాల్సి వస్తుంది.
Will the river find its sea? Or forever wander in its search to be!
Sapta Sagaradaache Ello – Side B trailer is out now! 🤗
Here’s the LINK : https://t.co/eJd0qlIvYV#SSESideBTrailer #SSDSideBTrailer #EKTSideBTrailer @hemanthrao11 @rukminitweets @Chaithra_Achar_… pic.twitter.com/eD0pR0MxVr
— Rakshit Shetty (@rakshitshetty) November 4, 2023
ఇక ఇప్పుడు సెకండ్ పార్టులో జైలు నుంచి విడుదల తర్వాత హీరో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటీ ? అతడి భార్య ఎక్కుడుంది ? తన భార్యని మళ్లీ కలిశాడా ? అనేది సినిమా. ‘ ఈ సినిమా చైత్ర ఆచార్ కీలకపాత్ర పోషించింది. మొదటి భాగంలో కనిపించిన అచ్యుత్ కుమార్ ఈ సినిమాలో కూడా కనిపించనున్నాడు. రెండో భాగంలో గోపాల్ దేశ్‌పాండే కీలక పాత్ర పోషిస్తున్నారు. హేమంత్ రావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందించారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ‘సప్త సాగరదాచే ఏలో సైడ్ బి’ చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది.
The clock is ticking and the anticipation’s building✨
Sapta Sagaradaache Ello – Side B trailer today at 6:06 PM#SSESideBTrailer#SSDSideBTrailer#EKTSideBTrailer pic.twitter.com/s7bGeLFcqh
— Paramvah Studios (@ParamvahStudios) November 4, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.