Samantha – Sai Pallavi: సాయి పల్లవి పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వీడియో వైరల్..

|

May 03, 2024 | 2:12 PM

ప్రేమమ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి యాక్టింగ్, డాన్స్, లుక్స్ చూసి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం నాగ చైతన్య సరసన తండేల్ మూవీలో నటిస్తుంది. అలాగే హిందీలో రామాయణ్ చిత్రంలో సీత పాత్ర పోషిస్తుంది. తాజాగా న్యాచురల్ బ్యూటీకి సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరలవుతుంది

సాయి పల్లవికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమమ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి యాక్టింగ్, డాన్స్, లుక్స్ చూసి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం నాగ చైతన్య సరసన తండేల్ మూవీలో నటిస్తుంది. అలాగే హిందీలో రామాయణ్ చిత్రంలో సీత పాత్ర పోషిస్తుంది. తాజాగా న్యాచురల్ బ్యూటీకి సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో సాయి పల్లవి డాన్స్ చూసి ఫిదా అయిపోయింది హీరోయిన్ సమంత. న్యాచురల్ బ్యూటీ టాలెండి పై ప్రశంసలు కురిపించింది సామ్. కొన్నేళ్ల క్రితం సాయి ప్లలవి ఢీ షోలో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షోకు అప్పట్లో సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యింది. ఆ సమయంలో సాయి ప్లలవి డాన్స్ చూసి ఫిదా అయిపోయింది సమంత. తన డాన్స్ చూస్తూ మాటలు రావడం లేదని. చూపు తిప్పుకోలేకపోయానని.. అంత అద్భుతంగా డాన్స్ చేశావంటూ ప్రశంసలు కురిపించింది సాయి పల్లవి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.