అక్కినేని నాగార్జునకు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే నెట్టింట్లో అభిమానులు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ, రాజకీయ ప్రముఖులు నాగార్జునకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా అక్కినేని కొడలు సమంత… తన ట్విట్టర్ వేదికగా నాగార్జునకు విషెస్ చెప్పింది. మీపై నాకున్న గౌరవం గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. ఎప్పుడు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను … హ్యప్పీ బర్త్ డే మామ అంటూ ట్వీట్ చేసింది. దీంతో అక్కినేని కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి అంటూ వస్తున్న వార్తలకు సామ్ తన ట్వీట్‌తో చెక్ పెట్టింది.
ట్వీట్..
No words can describe my respect for you. I wish you an abundance of health and happiness, today and always.Happy birthday to the man ,the phenomena @iamnagarjuna mama?☺️♥️
— S (@Samanthaprabhu2) August 29, 2021
గత కొద్ది రోజులుగా నాగచైతన్యకు, సమంతకు పడడం లేదని.. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తున్నాయని నెట్టింట్లో కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. తన సోషల్ మీడియా అకౌంట్లలో సమంత అక్కినేని అనే పదాన్ని తొలగించడమే అందుకు కారణం. సమంత అక్కినేని అనే పదాన్ని తొలగించి కేవలం ఎస్ అని మాత్రమే ఉండడంతో సోషల్ మీడియాలో సామ్, చై వ్యక్తిగత జీవితంలో విబేధాలు తలెత్తాయని.. త్వరలోనే విడిపోతున్నారంటూ రూమర్స్ వినిపించారు. దీనిపై స్పందించిన సమంత అవన్ని కేవలం రూమర్స్ మాత్రమే అని.. తమ మధ్య ఏలాంటి మనస్పర్థలు లేవని క్లారిటీ ఇచ్చింది. తాజాగా నాగార్జున బర్త్ డే కావడంతో సోషల్ మీడియా ద్వారా సామ్ శుభాకాంక్షలు తెలిపింది.
Nagarjuna: డెవిల్ ఈజ్ బ్యాక్.. స్వర్గం నుంచి దిగివస్తున్న బంగార్రాజు.. నాగ్ ఫస్ట్‌లుక్ అదుర్స్..