Republic Movie: వెరైటీగా రిపబ్లిక్ మూవీ మాస్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన మెగా మేనల్లుడు..

వరుస ఫ్లాప్‌లనుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తిరిగి సక్సెస్ ట్రాక్‌లో కంటిన్యూ అవుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ నుంచి చిత్రలహరి సినిమా తేజ్‌ను బయటపడేసింది.

Republic Movie: వెరైటీగా రిపబ్లిక్ మూవీ మాస్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన మెగా మేనల్లుడు..
Tej

Updated on: Sep 03, 2021 | 5:17 PM

Republic Movie: వరుస ఫ్లాప్‌లనుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తిరిగి సక్సెస్ ట్రాక్‌లో కంటిన్యూ అవుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ నుంచి చిత్రలహరి సినిమా తేజ్‌ను బయటపడేసింది. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత హిట్ రుచి చూశాడు ఈ మెగా హీరో. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడు. ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. చిత్రలహరి సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో ప్రతి రోజు పండగే అనే సినిమా చేసాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఇటీవల వచ్చిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు రిపబ్లిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ సుప్రీం హీరో. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో త్వరలో ఓ మాస్ మసాలా పాటను విడుదల చేయనున్నారు. ఈ పాటకు సంబంధించిన అప్డేట్‌ను వెరైటీగా ఇచ్చాడు తేజ్.

సాయి తేజ్ కారులో పాటలు వింటూ ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా మ్యూజిక్ సిస్టమ్ మాట్లాడుతుంది. ఆ సిస్టమ్ నుంచి వెన్నెల కిషోర్ వాయిస్ వినిపిస్తుంది. అప్పుడెప్పుడో  పిల్లనువ్వులేని జీవితం సినిమాలో డాన్స్‌లతో ఆకట్టుకున్న తేజ్ ఇప్పుడు ఎందుకు డాన్స్ వేయడం లేదు అంటూ ప్రశ్నిచాడు కిషోర్. దానికి తేజ్ ఆయా సినిమాల కథలు డిమాండ్ చేయడంతో మాస్ సాంగ్స్ పడలేదు.. దాంతో డాన్స్‌కు అవకాశం లేకుండా పోయింది అని చెప్పాడు. మరి ఇప్పుడు రాబోతున్న రిపబ్లిక్ సినిమాలో అయినా మాస్ సాంగ్ ఉంటుందా అని అడగ్గా.. మ్యూజిక్ సిస్టమ్ మారుమ్రోగిపోయే జాతర సాంగ్ ఉంది అంటూ హింట్ ఇచ్చాడు. మణిశర్మ సంగీత సారథ్యంలో జోరు సే అంటూ సాగె ఈ జాతర సాంగ్‌ను సెప్టెంబర్ 6న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో పంజా అభిరామ్ ఐఏఎస్‌గా కనిపించనున్నాడు. అలాగే సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Punam Kaur: డ్రగ్స్‌ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి పూనమ్‌ కౌర్‌.. త్వరలోనే అన్ని విషయాలు చెబుతానంటూ.

Anushka Sharma: ఓవల్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్ల భార్యలు సందడి.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

బిగ్ బాస్ 5: ఈ ఐదు కంటెస్టెంట్లదే అత్యధిక రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

 

Loading...
Unable to load recommendations.
Follow Us