ఏంటి ప్రభాస్ ఇది? ఈ కలెక్షన్ల ఊచకోత ఏంటి?. డివైడ్ టాక్ వచ్చిన సినిమాకు కలెక్షన్లు ఈ స్థాయిలో రావడం నిజంగా ఏ లాంగ్వేజ్ హీరో అందుకోని ఫీట్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీతో రికార్డులు సృష్టిస్తోంది. అసలు ఏం జరుగుతుందోొ బీ టౌన్ జనాలకు అర్ధం కావడంలేదు. సౌత్ సినిమాలకు, మన వాళ్ల కంటెంట్‌కు అక్కడి మాస్ జనాలు ఎట్రాక్ట్ అవుతున్నారు. ఖాన్స్ హిట్టు కోసం ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేస్తుంటే..మన వాళ్లు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నారు. విడుదలయిన 7 రోజుల్లోనే సాహో ప్రపంచవ్యాప్తంగా 370 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.
Setting Box Office on Fire 🔥#Saaho collects whopping 370 Cr+ gross & Counting in 7 days worldwide!
Book tickets here : https://t.co/3g8zydBuXu #SaahoInCinemas pic.twitter.com/0SvpJQqLIx
— UV Creations (@UV_Creations) September 6, 2019
‘సాహో’తో ప్రభాస్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. యూఎస్‌లో 3 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన ఐదో తెలుగు చిత్రంగా‘సాహో’ నిలిచింది. ఈ జాబితాలో బాహుబలి-2(12 మిలియన్ డాలర్లు) టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో బాహుబలి(6.9 మిలియన్ డాలర్లు), రంగస్థలం(3.5 మిలయన్ డాలర్లు), భరత్ అనే నేను(3.4 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.
‘సాహో’లో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించింది. అరుణ్ విజయ్, జాకీష్రాఫ్, మందిరాబేడీ, మహేశ్ మంజ్రేకర్, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జిబ్రాన్ నేపథ్య సంగీతమందించాడు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది.