Ritika Nayak: ఆ టాలీవుడ్ హీరో అంటే చాలా ఇష్టం.. కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే: రితికా నాయక్

నటించింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది రితికా నాయక్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో సందీప్ కిషన్ 'పవర్ పేట'తో పాటు డ్యూయెట్ అనే బైలింగువల్ సినిమా కూడా ఉంది.

Ritika Nayak: ఆ టాలీవుడ్ హీరో అంటే  చాలా ఇష్టం.. కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే: రితికా నాయక్
Ritika Nayak

Updated on: Oct 27, 2026 | 10:43 PM

తెలుగు సినిమా పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది యంగ్ హీరోయిన్ రితికా నాయక్. విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కల్యాణం’తో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నానితో కలిసి హాయ్ నాన్న అనే సినిమాలో యాక్ట్ చేసింది. ఇక తేజ సజ్జా తో కలిసి రితికా నటించిన మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. మిరాయ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయింది రితిక. ఇక ఆ మధ్యన వరుణ్ తేజ్ తో కలిసి ఆమె నటించిన కొరియన్ కనకరాజు కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో సందీప్ కిషన్ పవర్ పేట ఒకటి కాగా, డ్యూయెట్ అనే ఓ తమిళ బైలింగువల్ సినిమా కూడా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగుల్లో బిజీగా ఉంటోంది రితికా నాకక్. ఇదిలా ఉంటే మంగళవారం (అక్టోబర్ 27) రితికా నాయక్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు ఈముద్దుగుమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో రితికాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పిన మాటలు కూడా మరోసారి తెర మీదకు వస్తున్నాయి

‘నాకు అందమైన రూపం ఉందని మాత్రమే కాకుండా.. ‘బాగా నటిస్తుంది’ అని ప్రేక్షకులు అనుకోవాలన్నదే నా లక్ష్యం. అన్ని రకాల పాత్రల్లోనూ నటించాలని ఉంది. ఒక్క తరహా పాత్రలకే పరిమితం కావడం నాకు ఇష్టం లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రితిక. మీ క్రష్‌ ఎవరని రితికాను ఓ సందర్భంలో అడగ్గా.. తనకు అల్లు అర్జున్‌పై క్రష్‌ ఉందని మనసులో మాటను బయట పెట్టిందీ ముద్దుగుమ్మ. ఇక జీవిత భాగస్వామి విషయంలోనూ ఆమెకు కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయని రితికా పేర్కొంది. ‘నన్ను ఎంతో ప్రేమించే వ్యక్తి భర్తగా రావాలి. అలాగే బంధంలో నమ్మకానికి ప్రాధాన్యమివ్వాలి. నా వృత్తిని అర్థం చేసుకుంటూ, కెరీర్‌లో ముందుకు సాగేందుకు ప్రోత్సహించే వ్యక్తి నాకు భర్తగా రావాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది రితిక. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పవర్ పేట సినిమాలో రితికా నాయక్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us