
జబర్దస్త్ కమెడియన్ రైజింగ్ రాజు గుర్తున్నాడా..? చాలా కాలం అయ్యింది ఆయన తెర పై కనిపించి. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపై తెచ్చుకున్నాడు రాజు. హైపర్ ఆది టీమ్ లో కామెడీ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే పలు సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రైజింగ్ రాజు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. రామచంద్రపురంలో ఉన్న అమ్మ వంటిల్లు అనే హోటల్ చైర్మన్ సతీష్ రెడ్డి ద్వారా తనకు జబర్దస్త్‌లో అవకాశం లభించిందని రాజు వెల్లడించారు. ఈ హోటల్ ఒక సెంటిమెంట్‌గా సినీ ప్రముఖులకు ప్రసిద్ధి చెందిందని, శంకరాభరణం వంటి అనేక చిత్రాల షూటింగ్‌లు అక్కడ జరిగాయని రాజు గుర్తు చేసుకున్నారు. సతీష్ రెడ్డి తనలోని ప్రతిభను గుర్తించి, చంటికి పరిచయం చేశారని, ఆ సమయంలో తాను హైదరాబాద్‌లో పెయింటింగ్ పనులు చేసుకుంటున్నానని రాజు పేర్కొన్నారు.
చంటి సిఫారసుతో జబర్దస్త్‌లో ప్రవేశించిన రాజు, మొదటి ఎపిసోడ్‌లోనే చంటి టీంలో ప్రెసిడెంట్ అసిస్టెంట్‌గా స్కిట్ చేసి విజయం సాధించారు. అప్పుడు నాగబాబు తనను విపరీతంగా మెచ్చుకుంటూ, చంటికి ఒక మంచి ఆర్టిస్ట్ దొరికాడని ప్రశంసించారని తెలిపారు. అక్కడి నుండి చంటి గారితో తన ప్రయాణం కొనసాగిందని, అనేక వేషాలు వేశానని పేర్కొన్నారు. చంటి జబర్దస్త్ నుండి డ్రాప్ అయిన తర్వాత, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ రాజుకు మద్దతు ఇచ్చి, ఏ టీంలోకి వెళ్లాలనుకుంటే ఆ టీంలోకి వెళ్లవచ్చని సూచించిందని రాజు తెలిపారు. తనకు అలవాటైన టీం అయినందున బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ టీంలోకి వెళ్లినట్లు రాజు వివరించారు. సుమారు 20-30 ఎపిసోడ్‌ల తర్వాత, “జల్సా టైం” అనే ఒక విభాగం మొదలైందని, అందులో హైపర్ ఆది తనను ఎంపిక చేసి ఆరు స్కిట్‌లు చేయించారని రాజు వెల్లడించారు. ఆ ఆరు స్కిట్‌లకు అద్భుతమైన రేటింగ్, లైక్స్ వచ్చాయని తెలిపారు. ఆ విజయాల ఫలితంగా, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, న్యాయనిర్ణేతల నిర్ణయంతో హైపర్ ఆది, రైజింగ్ రాజు టీం లీడర్లుగా మారారని పేర్కొన్నారు.
అయితే తమ టీంలో హైపర్ ఆదిదే కీలక పాత్ర అని రాజు స్పష్టం చేశారు. ఆది గారు కథ, మాటలు, ఆర్టిస్టులతో చేయించే విధానం, అన్నీ ఆయనే చూసుకుంటారు. రాజు గారు మీరు ఇలా చేయండి చాలు అంటాడు. కథ రాయడం, పంచ్ డైలాగులు రాయడం వంటి బాధ్యతలు అన్నీ హైపర్ ఆదినే చూసుకుంటారని తెలిపాడు. మిగతా ఆర్టిస్టులకు ఎలా నటించాలో చెప్పడం, కథను ఎలా రూపొందించాలో, డైలాగులను ఎలా పలకాలో ఏ టు జెడ్ అన్నీ ఆదినే చూసుకుంటారని, తనపై ఆయనకు పరిపూర్ణ నమ్మకం ఉందని రాజు పేర్కొన్నారు. మనది ఇంత కూడా అందులో ఉండదు. అందులో గొప్పోడని చెప్పొచ్చు ఆది గారు అని హైపర్ ఆది పై రైజింగ్ రాజు ప్రశంసలు కురిపించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.