Akira Nandan: ఉత్తేజ్ కూతురు పాటకు అకీరా మ్యూజిక్.. ఫిదా అయిపోతున్న ఫ్యాన్స్.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్

రేణూ.. సోషల్ మీడియాలో ఒక్క చిన్న పోస్ట్ చేస్తే చాలు.. వెంటనే వైరల్ అయిపోతోంది. ఆమె ఎక్కువగా తన పిల్లలకు సంబంధించిన...

Akira Nandan: ఉత్తేజ్ కూతురు పాటకు అకీరా మ్యూజిక్.. ఫిదా అయిపోతున్న ఫ్యాన్స్.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్
Akira Music

Updated on: Aug 22, 2021 | 6:46 PM

రేణూ.. సోషల్ మీడియాలో ఒక్క చిన్న పోస్ట్ చేస్తే చాలు.. వెంటనే వైరల్ అయిపోతోంది. ఆమె ఎక్కువగా తన పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఎక్కువగా అకీరా నందన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియోలో అకీరా కర్రసాము చేస్తూ కనిపించాడు. ఆ వీడియోలో అతడి స్కిల్ చూసి.. అందరూ ఆశ్చర్యపోయారు. అతడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే టాక్ కూడా నడిచింది. అయితే ఆ ప్రచారంపై స్పందించిన రేణూ.. అకీరా ఇంకా చిన్న పిల్లాడని.. ఇప్పుడైతే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చే ఇంట్రప్ట్ లేదని క్లారిటీ ఇచ్చారు. అకీరాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని.. అందులోనే అతడు మాస్టర్స్ చేస్తాడని వెల్లడించారు. అయితే తాజాగా ఉత్తేజ్ ఉత్తేజ్ ఫ్యామిలీ రేణూ దేశాయ్ ఇంటికి వెళ్లినట్టు ఉన్నారు. ఈ క్రమంలో ఉత్తేజ్ కూతురు ఆలపిస్తున్న పాటకు అకీరా సంగీతాన్ని అందించాడు.   ఆ వీడియోను రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు. మొత్తానికి అకీరా తన అభిరుచి ప్రకారం ముందుకు వెళ్లి సంగీతంతో అందరినీ మైమరిపిస్తాడేమో చూడాలి.

వీడియో దిగువన వీక్షించండి

Also Read:Deepika Pilli: దీపిక పిల్లి.. మరీ ఇంత అందమైతే ఎట్టా అమ్మాయ్..

AP Weather: ఏపీ ప్రజలకు అలెర్ట్.. రేపు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం

Loading...
Unable to load recommendations.
Follow Us