
కరోనా.. ఒకానొక సమయంలో దీని పేరు వింటేనే జనాలు భయంతో వణికిపోయారు. దాంతో లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. లాక్ డౌన్ దెబ్బకు అల్లాడిపోయారు. ఇక లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. థియేటర్స్ మూతబడిపోవడంతో జనాలు ఓటీటీలకు, సోషల్ మీడియాకు బాగా అలవాటుపడిపోయారు. ఇక ఇన్ స్టా గ్రామ్ ను కూడా గట్టిగానే వాడేశారు నెటిజన్స్. ఇక రీల్స్ తో చాలా మంది పాపులర్ అయ్యారు. రకరకాల రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో తెగ హడావిడి చేశారు. కొంతమంది పిచ్చి పిచ్చి చేష్టలు చేసి నెటిజన్స్ ను ఆకట్టుకొని పాపులర్ అవ్వాలని ఏవేవో చేశారు. అలాగే ఇంకొంతమంది తమ టాలెంట్ ను బయటపెట్టి జనాలను ఆకట్టుకున్నారు. ఇక లాక్ డౌన్ లో తెగ వైరల్ అయిన రీల్ ఇది.. ఈ రీల్ గుర్తుందా.?
చాలా మంది యువతులు రీల్స్ చేసి ఫాలోవర్స్ ను విపరీతంగా పెంచుకున్నారు. ఒక్క వీడియో.. క్లిక్ అయితే చాలు రాత్రికిరాత్రి పాపులర్ అయినా వారు చాలామంది ఉన్నారు. వారిలో ఈ చిన్నది ఒకటి. నేచురల్ స్టార్ నాని హీరో నటించిన దసరా సినిమాలోని చమ్కీల అంగిలేసి సాంగ్ కు ఓ ఫన్నీ రీల్ చేసింది. డార్లింగ్ సినిమాలోని ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసిన ఫన్నీ సీన్ ను రీ క్రియేట్ చేసింది.
అప్పట్లో ఈ రీల్ తెగ వైరల్ అయ్యింది. ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు ఇదే రీల్ తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఆ అమ్మాయి ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ నెటిజన్స్ ను తెగ ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉంది.? ఇంకా రీల్స్ చేస్తుందా.? అని చాలా మంది నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ గాలిస్తున్నారు. అలాగే ఆమె మీద ఫన్నీ మీమ్స్ కూడా చేస్తున్నారు. ఆమె పేరు కీర్తి శ్రీ.. ఈ చిన్నది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. డాన్స్ వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ చిన్నది క్లాసికల్ డాన్స్ చేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ చిన్నదాని వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.