
అందం అభినయం ఉన్న ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతున్న ముద్దుగుమ్మలు మనదగ్గర చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. బోలెడంత టాలెంట్ ఉన్నా ఈ ముద్దుగుమ్మ చెప్పుకోదగ్గ సినిమాల్లో కనిపించడం లేదు.. యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన నటించి మెప్పించింది. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కేవలం హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోను కనిపించి మెప్పించింది ఆ వయ్యారి. ఆ తర్వాత ఇప్పుడు విలన్ గా మారి ప్రేక్షకులను భయపెట్టనుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆ అందాల తార మరెవరో కాదు ముద్దుగుమ్మ రెజీనా కాసాండ్రా. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ చిత్రాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన రెజీనా.. ప్రస్తుతం విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ్ లో సినిమా చేస్తుంది. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మహాశక్తి సినిమాలో రెజీనా నెగిటివ్ రోల్ లో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే మహాశక్తి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా రెజీనా చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ పై రెజీనా షాకింగ్ కామెంట్స్ చేసింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్ లో తాను హీరో భార్యగా నటించానని ఆ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని తెలిపింది రెజీనా. అయినప్పటికీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల నుంచి తనను కావాలనే పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది రెజీనా.. సినిమా ప్రమోషన్ల నుంచి ఏ కారణం చెప్పకుండా నా పేరును పూర్తిగా తొలగించారు. అలాగే నాపై, అక్షయ్ కుమార్‌పై షూట్ చ్చేసిన స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎక్కడ కుడా నన్ను ట్యాగ్ చేయలేదు. నాపేరు పెట్టలేదు. దీన్ని నేను ఏమని భావించాలి?. నేను దక్షిణాది నటిని అయినందుకే ఈ వివక్షా.? నార్త్ హీరోయిన్స్ తమ ఒపీనియన్ చెప్తే ప్రొఫెషనల్ అంటూ తెగ పొగిడేస్తారు. అదే సౌత్ యాక్టర్లు ప్రశ్నిస్తే పొగరుబోతులుగా ముద్ర వేస్తారు.. సౌత్ సినిమాను చిన్నచూపు చూస్తూ న నార్త్ యాక్టర్స్ మాట్లాడే తీరు కరెక్ట్ కాదు అని రెజీనా అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి