Ravi Babu: టిఫిన్‌లో వడ రాలేదని సినిమా షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు.. ఆ టాలీవుడ్ నటుడిపై మండిపడ్డ రవిబాబు

ఇటీవలే రేజర్ సినిమాతో మన ముందుకు వచ్చారు రవిబాబు. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ డీసెంట్ టాక్ తో రన్ అవుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరైన రవి బాబు తన తోటి నటీనటుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Ravi Babu: టిఫిన్‌లో వడ రాలేదని సినిమా షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు.. ఆ టాలీవుడ్ నటుడిపై మండిపడ్డ రవిబాబు
Ravi Babu

Updated on: May 10, 2026 | 1:27 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో రవి బాబు ఒకరు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, రైటర్ గా, డైరెక్టర్ గా వివిధ రంగాల్లో సత్తా చాటుతున్నారాయన. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆయన అల్లరి సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నారు. డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాతన నచ్చావులే, అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ, అనసూయ, అమరావతి, మనసారా, నువ్విలా, అవను, అవును2, క్రష్, ఏనుగు తొండం ఘటికాచలం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించారు. లేటెస్ట్ గా రేజర్ అంటూ ఓ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో మన ముందుకు వచ్చారు రవి బాబు. మే 08న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డీసెంట్ టాక్ తో రన్ అవుతోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు రవి బాబు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే తన తోటి నటీనటుల గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘నటులకు ఉండాల్సిన మొదటి లక్షణం సమయపాలన. షూటింగ్ సెట్ కు వచ్చాక 100% ఏకాగ్రత పని మీద మాత్రమే ఉండాలి. వడలు, టిఫిను లేదా క్యారవాన్ సౌకర్యాల గురించి ఆలోచించకూడదు. ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ పడే కష్టం నాకు తెలుసు, అందుకే నేను ఎవరికీ భారం కాకూడదని అనుకుంటాను. సెట్లో క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా సహించే ప్రసక్తే లేదు. ఎవరైనా అనవసరమైన గొడవలు చేస్తే మొహమాట పడకుండా సెట్ నుండి బయటకు పంపించేస్తాను’ ‘ అని రవిబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో సినిమా సెట్ లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నాడీ డైరెక్టర్. ఆర్టిస్టుల ప్రవర్తన ఒక్కోసారి ఎంత విచిత్రంగా ఉంటుందో చెబుతూ రెండు సంఘటనలను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘ ఒక ఆర్టిస్ట్ షూటింగ్కు వచ్చి, కేవలం టిఫిన్లో తనకు ఇష్టమైన ‘వడ’ లేదని వెళ్లిపోయరు. ఈ విషయం తెలిసి నేను ఆశ్చర్యపోయాను. మరొక సందర్భంలో సీన్ షూటింగ్ జరుగుతుండగానే, వేరే చోట ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందంటూ ఒక నటుడు పని ఆపేసి వెళ్లిపోయారు’ అని రవి బాబు అసహనం వ్యక్తం చేశారు రవిబాబు. అయితే ఆ నటుల పేర్లు మాత్రం రివీల్ చేయలేదీ డైరెక్టర్. ప్రస్తుతం రవి బాబు కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అతనిని ఇబ్బంది పెట్టిన నటులు ఎవరబ్బా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us