Vijay- Rashmika: విజయ్-రష్మిక మళ్లీ సీక్రెట్ ట్రిప్‌.. వియత్నాం టూర్‌లో సరదా సరదాగా.. ఫొటోస్‌ చూశారా?

|

Jan 16, 2024 | 9:27 AM

టాలీవుడ్  రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా మళ్లీ సీక్రెట్‌ ట్రిప్‌కు వెళ్లారా? గతంలో మాల్దీవులకు వెళ్లినట్లు ఈసారి ఇద్దరూ కలిసి వియత్నాం అందాలను ఆస్వాదించారా? అంటే అవుననే అంటున్నారు కొంత మంది నెటిజన్లు. వారం రోజుల వ్యవధిలో విజయ్‌, రష్మికలు షేర్‌ చేసుకున్న ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులే ఇందుకు నిదర్శనమంటున్నారు.

Vijay- Rashmika: విజయ్-రష్మిక మళ్లీ సీక్రెట్ ట్రిప్‌.. వియత్నాం టూర్‌లో సరదా సరదాగా.. ఫొటోస్‌ చూశారా?
Rashmika Mandanna , Vijay Deverakonda
Follow us on

టాలీవుడ్  రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా మళ్లీ సీక్రెట్‌ ట్రిప్‌కు వెళ్లారా? గతంలో మాల్దీవులకు వెళ్లినట్లు ఈసారి ఇద్దరూ కలిసి వియత్నాం అందాలను ఆస్వాదించారా? అంటే అవుననే అంటున్నారు కొంత మంది నెటిజన్లు. వారం రోజుల వ్యవధిలో విజయ్‌, రష్మికలు షేర్‌ చేసుకున్న ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఇటీవల ఈ ప్రేమ పక్షులు నిశ్చితార్థం చేసుకోనున్నారంటూ, త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే విజయ్‌ దేవరకొండ టీమ్‌ ఈ రూమర్లను గట్టిగా ఖండించింది. అయితే ఇంతలోనే విజయ్‌, రష్మికలు సీక్రెట్‌గా వియత్నాం వెకేషన్‌కు వెళ్లినట్లు వార్తలు రావడం గమనార్హం. గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో జంటగా కనిపించారు విజయ్, రష్మిక. ఈ రెండు సినిమాల్లో రష్మిక, విజయ్‌ల ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ అందరినీ ఆకట్టుకుంది. చాలామందికి రష్మిక- విజయ్‌ జోడీ ఫేవరేట్ గా మారిపోయింది. అదే సమయంలో వీరిద్దరూ నిజ జీవితంలో ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.

పార్టీలు, ఫంక్షన్లు, డిన్నర్లలో విజయ్‌, రష్మిక జంటగా కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. అలాగే వెకేషన్లు, ట్రిప్స్‌లకు కలిసే వెళ్లిన ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. అయితే ఈ వార్తలను పలుసార్లు ఖండించారు విజయ్‌, రష్మిక. తాము మంచి స్నేహితులమంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం తన ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాలో కొన్ని ఫొటోలు షేర్‌ చేశాడు విజయ్‌ దేవరకొండ. ప్లేస్‌ చెప్పలేదు కానీ వియత్నాంలోనే ఆ ఫొటోలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారం రోజుల వ్యవధిలోనే రష్మిక మందన్నా కూడా కొన్ని ఫొటోలను నెట్టింట షేర్‌ చేసింది. ఇవన్నీ వియత్నాంలో దిగిన ఫొటోసే అని రష్మిక క్లారిటీ ఇచ్చింది. రష్మిక, విజయ్‌ ఫొటోలను చూసిన అభిమానులు, నెటిజన్లు.. వీరూ కలిసే వియత్నాం వెకేషన్‌ కు వెళ్లారంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫొటోస్..

రష్మిక ఇన్ స్టాగ్రామ్ ఫొటోస్..

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..