Rashmika Mandanna: మెగాఆఫర్ దక్కించుకున్న లక్కీ బ్యూటీ.. చరణ్ సినిమాలో ఛాన్స్..

|

Jul 28, 2021 | 7:27 AM

మెగా ఫ్యాన్స్ అంతా రామ్ చరణ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో...

Rashmika Mandanna: మెగాఆఫర్ దక్కించుకున్న లక్కీ బ్యూటీ.. చరణ్ సినిమాలో ఛాన్స్..
Rashmika
Follow us on

Rashmika Mandanna: మెగాఫ్యాన్స్ అంతా రామ్ చరణ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్‌‌‌లో చూద్దామా.. అని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు చరణ్. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు మెగాస్టార్ నటిస్తోన్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆచార్యలో సిద్ద అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. వీటితోపాటు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పనులు మొదలు పెట్టేశారు. ఈ చిత్రానికి మాటలు బుర్ర సాయిమాధవ్ అందిస్తుండగా .. సంగీతదర్శకుడిగా తమన్ ను ఎంపిక చేశారు. తాజాగా హీరోయిన్ కూడా ఫిక్స్ అయ్యిందని టాక్ నడుస్తోంది.

చరణ్ -శంకర్ కాంబినేషన్‌‌‌‌లో రాబోతోన్న సినిమాలో హీరోయిన్ గా లక్కీ బ్యూటీ రష్మిక మందనను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌‌‌లో యమ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. సినిమాకు మరింత ప్లస్ అవుతోందని భవించిన శంకర్ ఈ అమ్మడిని ఓకే చేసినట్టు తేలుతోంది.ఇక శంకర్ లాంటి టాప్ డైరెక్టర్.. పైగా మెగా పవర్ స్టార్ సరసన ఇలాంటి ఛాన్స్‌‌‌‌ను ఎవరైనా వదులుకుంటారా..? దాంతో రష్మిక కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది టాక్. ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప సినిమాలో హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌‌‌లో కూడా సినిమాలు చేస్తోంది. ఇక తమిళ్‌‌‌‌లోనూ ఈ చిన్నది ఆఫర్లు దక్కించుకుంటోంది. మరి శంకర్ -చరణ్ సినిమాలో రష్మిక నటిస్తోందా..? లేదా..? అన్నదానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hero Nani: నిత్యావసర సరుకులు పెరుగుతున్నా పట్టించుకోరు.. కానీ థియేటర్లపై ఆంక్షలు: హీరో నాని సంచలన వ్యాఖ్యలు..!

One Movie- Aha OTT: ‘ఆహ’లో మెగాస్టార్ పొలిటికల్ థ్రిల్లర్.. ‘వన్’ ట్రైలర్ విడుదల.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Vijay – Chiranjeevi: విజయ్‌ దేవరకొండ వదులుకున్న చిత్రానికి చిరంజీవి ఓకే చెప్పాడా.? వైరల్‌గా మారిన ఆసక్తికర వార్త..