Rashmika Mandanna: తనకు తానే సర్టిఫికేట్‌ ఇచ్చేసుకున్న రష్మిక మందన్న.. ఇంతకీ ఏంటో మీరే చదవండి

ఈమె చాలా లక్కీ అంటూ తనకు తానే సర్టిఫికేట్‌ ఇచ్చేసుకుంటున్నారు కూర్గ్ బ్యూటీ రష్మిక మందన్న. టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతున్న రష్మిక, స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

Rashmika Mandanna: తనకు తానే సర్టిఫికేట్‌ ఇచ్చేసుకున్న రష్మిక మందన్న.. ఇంతకీ ఏంటో మీరే చదవండి

Updated on: Jan 31, 2021 | 3:41 PM

Rashmika Mandanna:  ఈమె చాలా లక్కీ అంటూ తనకు తానే సర్టిఫికేట్‌ ఇచ్చేసుకుంటున్నారు కూర్గ్ బ్యూటీ రష్మిక మందన్న. టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతున్న రష్మిక, స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే బిగ్ ప్రాజెక్ట్స్‌లో ఛాన్స్‌లు రావటంతో రష్మిక ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. అంతేకాదు ఈ బ్యూటీ చేసిన సినిమాలు మంచి సక్సెస్‌ కావటం కూడా రష్మికకు కలిసొచ్చింది.

ప్రజెంట్‌ ఫీలింగ్‌ ‘స్కై హై’ అంటూ మురిసి పోతున్నారు రష్మిక. టాలీవుడ్‌లో ఫస్ట్ మూవీ ‘ఛలో’ తోనే నాగశౌర్యను సక్సెస్‌ ట్రాక్ ఎక్కించిన క్రెడిట్‌ రష్మిక ఖాతాలో పడిపోయింది. తరువాత విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’.. మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ తో ‘భీష్మ’ లాంటి సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకున్నారు.

ఇలా వరుస సక్సెస్‌లు రష్మిక కాన్ఫిడెన్స్‌ను ఫీక్స్‌కు తీసుకెళ్లాయి. అందుకే తనకి తాను లక్కీ గర్ల్ అని ఫీల్ అవుతున్నారు రష్మిక మందన్న. ప్రజెంట్‌ అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ… ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఇచ్చేస్తున్నారు. ఆమె కోలీవుడ్‌ మూవీ ‘సుల్తాన్’‌ టీజర్ కూడా కమింగ్‌ సూన్‌ అన్నమాట.

Also Read:

Rashi Khanna: రాశీఖన్నా మోటివేషనల్‌ స్పీచ్‌.. చాలా పెద్ద మాటలే చెప్పేసింది.. మీరే చూడండి

Director Shankar: దర్శకుడు శంకర్‌పై నాన్-బెయిలబుల్‌ వారెంట్.. ‘రోబో’ సినిమా కాపీ కేసులో కోర్టు సంచలన తీర్పు

Follow Us