
Rashmika Fan: సినీ తారలను అభిమానించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తెరపై కనిపించే తారలను దైవంగా భావించే వారు మన సమాజంలో చాలా మందే ఉన్నారు. ఇటీవల ఈ అభిమానం మరింత ఎక్కువవుతోంది. తమ అభిమాన తారలను కలుసుకోవాలనే ఉద్దేశంతో అభిమానులు పెద్ద సాహసమే చేస్తున్నారు. తాజాగా అందాల తార రష్మిక మందన్న అభిమాని కూడా ఇలాంటి సాహసాన్నే చేశాడు.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి అనే అభిమాని రష్మికు కలవాలనే కోరికతో.. 900 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. గూగుల్‌లో రష్మిక చిరునామాను వెతికి.. మైసూర్ వరకు రైలులో, అక్కడి నుంచి ముగ్లా అనే గ్రామానికి ఆటోలో వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లే సరికి రష్మిక ఆ అడ్రస్‌లో లేదని చెప్పి తిరిగి వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో సదరు అభిమాని నిరాశతో ఎదురు తిరిగాడు. అయితే ఈ విషయం తెలసుకున్న రష్మిక.. ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా రష్మిక ట్వీట్ చేస్తూ.. `నా కోసం ఓ అభిమాని ఎంతో దూరం నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చాడని తెలిసింది. దయచేసి ఇలాంటివి చేయకండి. అతన్ని కలవనందుకు నేను చాలా ఫీలవుతున్నాను. ఆ అభిమానిని కచ్చితంగా ఏదో రోజు కలిసి తీరుతాను` అంటూ ట్వీట్ చేసింది.
Saaho director Sujeeth: మెగాస్టార్‌ను మిస్ చేసుకున్న సుజిత్.. ధనుష్‌తో దుమ్ము రేపుతాడా..?
Rashmika Mandanna: ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో జట్ స్పీడుతో దూసుకుపోతున్న రష్మిక