Rashmi Gautam : ప్రేమికులకు సలహా ఇచ్చిన జబర్ధస్ యాంకర్.. వ్యాలెంటైన్స్ డే అలా చేయొద్దంట..

మూగ జీవాలంటే యాంక‌ర్ ర‌ష్మికి చాలా ఇష్టమ‌న్న విష‌యం అందరికీ తెలిసిందే. మూగ జీవాల‌పై జాలి చూపాల‌ని ఆమె ప‌లు సంద‌ర్భాల్లో చెబుతూ ఉంటారు.

Rashmi Gautam : ప్రేమికులకు సలహా ఇచ్చిన జబర్ధస్ యాంకర్.. వ్యాలెంటైన్స్ డే అలా చేయొద్దంట..

Updated on: Feb 05, 2021 | 8:53 PM

Rashmi Gautam : మూగ జీవాలంటే యాంక‌ర్ ర‌ష్మికి చాలా ఇష్టమ‌న్న విష‌యం అందరికీ తెలిసిందే. మూగ జీవాల‌పై జాలి చూపాల‌ని ఆమె ప‌లు సంద‌ర్భాల్లో చెబుతూ ఉంటుంది. ఈ విష‌యంపై త‌న సోష‌ల్ మీడియాలోనూ ఆమె అవేర్‌నెస్ ఇస్తుంటుంది. లాక్ డౌన్ సమయంలో కుక్కలు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమె వాటికి ఆహరం అందించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని ఈమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది రష్మి.

చాలా మంది వారి లవర్ కు పెట్ డాగ్స్ ను బహుమానంగా ఇవ్వాలనుకుంటూ ఉంటారు. డాగ్స్ అనేవి కొన్ని రోజులు మాత్రమే ఉండేవి కాదు. దాదాపుగా 20 ఏళ్ల పాటు అవి మనతో ఉండి పోయేవి. అందుకే వాటిని బహుమానంగా ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. మీ లవర్ కు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఒక వేళ బ్రేకప్ అయితే దానిని రోడ్డుమీద పడేస్తారు. కనీసం దాన్ని పట్టించుకోవడం కూడా మానేస్తారు.. అందుకే ప్రేమికుల రోజున ప్రేమికులు ఎవరు గిఫ్ట్ గా పెట్స్ ను ఇవ్వొద్దు అంటూ చెప్పుకొచ్చింది రష్మి. కాగా రష్మి షేర్ చేసిన పోస్ట్ పై నెటిజన్లు రకరకాలు గా స్పందిస్తున్నారు. కొందరు ఇది చాలా మంచి సలహా అటు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

భారీ మల్టీస్టారర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఎన్టీఆర్ భామ.. షూటింగ్‏లోకి స్వాగతం పలికిన చిత్రయూనిట్..

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us