మహేశ్ మూవీ ప్రోగ్రామ్‌కి మెగాస్టార్.. రామ్ చరణ్ ఏమన్నారంటే?

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి పెద్దరికాన్ని చాటుకున్న మెగాస్టార్ చిరంజీవిపై ఆయన తనయుడు రామ్ చరణ్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. విజయవాడలో ఓ ప్రైవేటు మొబైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి సోమవారం వచ్చిన రామ్ చరణ్.. తెలుగు సినీ పరిశ్రమ సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. సినీరంగంలో జరుగుతున్న పరిణామాలపై కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌లో జరుగుతున్న పరిణామాలపై రామ్ చరణ్ తనదైన శైలిలో స్పందించారు. […]

మహేశ్ మూవీ ప్రోగ్రామ్‌కి మెగాస్టార్.. రామ్ చరణ్ ఏమన్నారంటే?

Updated on: Jan 06, 2020 | 3:05 PM

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి పెద్దరికాన్ని చాటుకున్న మెగాస్టార్ చిరంజీవిపై ఆయన తనయుడు రామ్ చరణ్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. విజయవాడలో ఓ ప్రైవేటు మొబైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి సోమవారం వచ్చిన రామ్ చరణ్.. తెలుగు సినీ పరిశ్రమ సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. సినీరంగంలో జరుగుతున్న పరిణామాలపై కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌లో జరుగుతున్న పరిణామాలపై రామ్ చరణ్ తనదైన శైలిలో స్పందించారు.

విజయవాడకు ఎప్పుడు వచ్చినా ఆనందంగా ఫీలవుతానని చెప్పుకున్న రామ్ చరణ్.. సినీరంగంలో జరుగుతున్న పరిణామాలను పెద్దలు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. తాను, ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ 65 శాతం పూర్తైందని రామ్ చరణ్ వెల్లడించారు. ఆర్అర్ఆర్ మూవీ జూలై 30 న విడుదల కానుందని.. ఆ సినిమా కోసం తాను వేచి చూస్తున్నానని చెప్పారు రామ్ చరణ్. ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రేక్షకులనందరినీ అలరిస్తుందన్న విశ్వాసాన్ని రామ్ చరణ్ వ్యక్తం చేశారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌కి మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి వెళ్ళడం మంచి పరిణామమని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. తక్కు వ సమయంలో సినిమా షూటింగ్‌లు పూర్తి చేయడం వల్ల ప్రొడ్యూసర్లకు ఆర్ధికంగా లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు రామ్ చరణ్.

బాలీవుడ్ నటులు టాలీవుడ్ తరలివస్తుంటే మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలని ప్రశ్నించారు. ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీస్ హవా నడుస్తుందని.. ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాల్సి వుందని అన్న రామ్ చరణ్ ఫ్యూచర్‌లో మరిన్ని మల్టిస్టారర్ మూవీస్ చేసే అవకాశముందన్న సంకేతాల్నిచ్చారు. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాలకు శుభాకాంక్షలు చెబుతున్నానంటూ ముగించారు మెగా పవర్ స్టార్.

Loading...
Unable to load recommendations.
Follow Us