
పెద్ది సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఊర మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే పెద్ది సినిమా రూ. 300కోట్ల వరకు వసూల్ చేసింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే జగపతిబాబు, శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటించారు. కాగా సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండటంతో చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో బుచ్చిబాబు, జగపతిబాబు , రామ్ చరణ్ మరికొంతమంది చిత్రయూనిట్ పాల్గొన్నారు.
పెద్ది థాంక్స్ మీట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమను పొందడం నాకు అర్థం కావట్లేదు.. సినిమా చూశాను.. చూడకపోయి ఉంటే ఇంకా బెటర్‌గా మాట్లాడేవాన్ని.. ఇది ఎవరో చేసింది కాదు.. నేను స్వతహాగా బుచ్చి అనే దర్శకుడిని నమ్మి చేశాను.. చాలా సంతృప్తిగా అనిపిస్తుంది అని రామ్ చరణ్ అన్నారు. ప్రసాద్ ఐమాక్స్ కదా సైలెంట్‌గా ఉంటారేమో అనుకున్నా.. కానీ శ్రీరాములు, భ్రమరాంబలా ఎంజాయ్ చేస్తున్నట్లు చేసారు ఆడియన్స్.. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చినందుకు థ్యాంక్యూ అందరికీ.. నా లైబ్రరీలో నెంబర్ 1,2గా మిగిలిపోయింది. చాలా రిస్క్‌తో కూడుకున్న కథ ఇది అని మొదటిరోజే అర్థమైంది. మనస్పూర్తిగా పని చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తుంది.. ఇలాంటి విజయం అందించిన అందరికీ థ్యాంక్యూ అని చరణ్ అన్నారు.
అలాగే ఇలాంటి సినిమాకు బిగ్గెస్ట్ సపోర్ట్ మీడియా మిత్రులే.. సినిమా నచ్చి మంచి రిపోర్ట్ ఇచ్చినందుకు.. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జగపతిబాబు గారి నటన చూసి కంట్లో నీళ్లొచ్చాయి.. శివరాజ్ కుమార్ గారు అందరికీ థ్యాంక్యూ . 185 రోజుల షూటింగ్‌లో ఆల్మోస్ట్ అన్ని రోజులు సెట్‌లోనే ఉన్న నిర్మాత సతీష్ గారికి థ్యాంక్యూ. అనంత శ్రీరామ్ గారు మీ పాటలెప్పుడూ నా లైబ్రరీలో ఉంటాయి. పెద్ది సినిమాకు సిన్సియారిటీ అవసరం.. ఇది నమ్మి థియేటర్స్‌కు రావాలంటే అంతే సిన్సియారిటీ కావాలి.. అందుకే మేం కూడా అలాగే చేసాం అని రామ్ చరణ్ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి