Peddi Movie : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ముందే వచ్చేస్తున్న పెద్ది.. కొత్త రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. ఇదివరకే థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన మేకర్స్.. ఇప్పుడు తాజాగా కొత్త డేట్ అనౌన్స్ చేశారు.

Peddi Movie : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ముందే వచ్చేస్తున్న పెద్ది.. కొత్త రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్..
Ramcharn Peddi Movie

Updated on: May 01, 2026 | 5:48 PM

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు. ఇప్పటికే ప్రకటించిన డేట్ కంటే ముందే ఈ సినిమాను తీసుకువస్తున్నారు. దీంతో ఇప్పుడు మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్ది చిత్రాన్ని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్‏తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో శ్రుతి హాసన్ స్పెషల్ సాంగ్ చేయనున్నారు. ఇటీవలే ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..

పెద్ది న్యూ రిలీజ్ డేట్ ఇదే..

డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ.. “పెద్దిగాడు అందరి హృదయాలకు దగ్గరగా ఉంటాడు. పెద్దిగాడిని మనసులోనుంచి తీసేయడం అంత ఈజీ కాదు. ఏప్రిల్‌ 30న రానందుకు క్షమించండి. జూన్‌ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి. జూన్‌ 4న చరణ్‌ మీద నా ప్రేమనంతా చూద్దురుగానీ” అని అన్నారు.

డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ” పెద్ది చాలా పెద్ద స్క్రిప్ట్. మంచి కమర్షియల్‌ సినిమా అలాగే ఎమోషనల్‌ మూవీ. గ్రౌండ్‌ లెవల్లో ఎమోషన్స్ మెయింటెయిన్‌ చేస్తూ డైలాగులు రాయడం మామూలు విషయం కాదు. ఆ బ్యాలన్స్ పట్టుకున్నాడు డైరక్టర్‌ బుచ్చిబాబు. ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. సాంగ్స్ బిగ్‌ స్క్రీన్‌ మీద చూస్తుంటే వేరేలా ఉంది. టీజర్‌లో విజువల్స్ మామూలుగా లేవు. రయ్ రయ్ సాంగ్‌లో చెర్రీ ఎనర్జీ మామూలుగా లేదు. చెర్రీ కెరీర్‌లో ఇలాంటి పెర్ఫార్మెన్స్ మనం ఎప్పుడూ చూడలేదు. జూన్‌ 4న మా సినిమా 5 భాషల్లో పెద్ది రిలీజ్‌ అవుతోంది. హిందీలోనూ చాలా పెద్ద రిలీజ్‌ ఉంది పెద్దికి” అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..

Follow Us