వరద బీభత్సంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊహించని విధంగా ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరిగింది. వీరిని ఆదుకోవటానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి వారికి తమ వంతు సాయంగా నిలవటానికి తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో హీరో రామ్ చరణ్ సైతం తనవంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి రూ.50 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. ‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయల విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు రామ్ చరణ్. తండ్రి చిరంజీవి సేవా బాటలో ప్రయాణిస్తూ ఆయనలాగానే రామ్ చరణ్ తెలుగు వారి కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించటంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు.
వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి…
— Ram Charan (@AlwaysRamCharan) September 4, 2024
వీరితో పాటు అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్ విశ్వక్ సేన్, సిద్దూ జొన్నల గడ్డ, నాగార్జున, అనన్య నాగళ్ల తదితరులు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తమవంతుగా ముఖ్యమంత్రుల వరద సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి.
మనందరం ఏదో…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.