
RRR Movie: కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో సినిమా రంగం ఒకటి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. లాక్డౌన్ విధించడంతో సినిమా చిత్రీకరణలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలు చిత్రాలు షూటింగ్లను వాయిదా వేసుకున్నాయి. ఈ సినిమాల్లో ఆర్.ఆర్.ఆర్ కూడా ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది.
అయితే తాజాగా పరిస్థితులు మళ్లీ మెరుగుపడడంతో ఆర్.ఆర్.ఆర్ యూనిట్ సినిమా చిత్రీకరణను తిరిగి ప్రారంభించింది. ఈ క్రమంలోనే సోమవారం జరిగిన చిత్ర షూటింగ్లో హీరో రామ్ చరణ్ పాల్గొన్నాడు. ఈవిషయాన్ని రామ్చరణ్ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ.. ‘‘లాక్డౌన్ 2.0ను ఎత్తివేసిన తర్వాత సినిమాల షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్చరణ్కు హెయిర్ స్టైల్ చేయడం ద్వారా నా రోజు ప్రారంభమైంది. మనందరి ఫేవరేట్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కుమ్రం భీమం పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.
Also Read: Fast & Furious 9 : విడుదలకు ముందే లీకైన ఫాస్ట్ & ఫ్యూరియస్ 9..! దీని వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసా..?