మా నాన్న వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన రజినీకాంత్ కూతురు

జైలర్ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఇటీవలే లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

మా నాన్న వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన రజినీకాంత్ కూతురు
Rajinikanth

Updated on: Mar 09, 2024 | 8:02 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా కాలం తర్వాత జైలర్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. జైలర్ సినిమాతో సూపర్ స్టార్ మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. జైలర్ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఇటీవలే లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన లాల్ సలాం సినిమా నిరాశపరచడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

లాల్ సలాం సినిమాలో రజినీకాంత్ తో పాటు విష్ణు విశాల్ , విక్రాంత్ నటించారు. లాల్ సలామ్ 9 ఫిబ్రవరి 2024న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం పై యశ్వర్య రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన తండ్రి వల్లే తన సినిమా ఫ్లాప్ అయ్యిందని అన్నారు ఐశ్వర్య. లాల్ సలాం సినిమాలో మొహిదీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ నటించారు అయితే ఆయన పాత్ర వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది అంటుంది ఐశ్వర్య.

నిజానికి లాల్ సలాం సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ పాత్ర కేవలం ఇలా వచ్చి అలా వెళ్లిపోవాలట.. అయితే ఆయన అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే ఎలా అంటూ అయన పాత్రను మరింత పెంచారట. దాంతో కథ పెరిగిపోయిందట. సినిమా ఫ్లాప్ అవ్వడానికి అదే కారణం అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రజినీకాంత్. నిజానికి సినిమా కంటెంట్ బాగుంది. కానీ రజినీకాంత్ ను చూపించిన తర్వాత ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయింది. ఆయన పాత్ర 10 నిమిషాలే.. అదికూడా ఇంట్రవెల్ లో వస్తారు కానీ సినిమా స్టార్టింగ్ లోనే చూపించాం.. కథకుడా ఆయన చుట్టూ తిరిగేలా మార్చేశాం. దాంతో సినిమా డిజాస్టర్ అయ్యింది అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us