Gaali Sampath : బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్రలో రూపొందిన చిత్రం `గాలి సంపత్. అనిల్ కో-డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ – “నా కెరీర్లో నేను చేసిన సరికొత్త ప్రయత్నం గాలి సంపత్ అన్నారు. అలాగే సినిమా రిలీజైన వెంటనే ఇంత అద్వితీయమైన రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉందన్నారు. తెలుగు సినిమాలో ఇంత వరకూ చూడని ఎక్స్పెరిమెంట్ ఈ సినిమాలో చేయడానికి ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించారు. చిత్ర నిర్మాత, కథా రచయిత ఎస్. కృష్ణ థియేటర్లో ఆడియన్స్ ఎంజాయ్ చేయడం చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆ ఎగ్జయిట్ మెంట్ నే మీ అందరితో పంచుకోవడం జరిగిందన్నారు. అలాగే ఏ కళాకారుడికైనా సరే ఇంతకు మించిన ఆనందం ఉంటుందని నేను అనుకోను. ఈ సినిమా ఒక తండ్రీ కొడుకుల కథ. శ్రీవిష్ణు, నేను చేస్తున్నప్పుడే తప్పకుండా గొప్ప సినిమా అవుతుందని ఇన్వాల్వ్ అయ్యి నటించాము. మిగతా నటీనటులు కూడా బాగా నటించారు. ఒక మంచి సినిమా చూశామనే ఆనందం ప్రేక్షకులకు, మంచి సినిమా చేశామనే ఆనందం మాకు మిగిలినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు. ముఖ్యంగా అన్నయ్యా.. ఆస్కార్ అంత పెర్ఫామెన్స్ చేశావు అన్న మాట నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నా గుండెల్లో ఉంచుకుంటాను. ఇంత మంచి పాత్ర నాకు ఇచ్చినందుకు మా అబ్బాయి అనిల్ రావిపూడికి, అనీష్ కృష్ణకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫిలిం స్కూల్లో ఉన్నప్పుడు నాకు మైమ్ పెర్ఫామెన్స్లోనే గోల్డ్ మెడల్ వచ్చింది. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు ఆ డ్రెస్ వేసుకుని స్టేజ్‌మీదకు రావడానికి మా మైమ్ మధునే కారణం. శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ చాలా బాగా నటించారు. ఈ సినిమా మా నిర్మాతలకి ఎంతో పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను “ అని రాజేంద్ర ప్రసాద్అ అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :