లారెన్స్ చ‌ల్ల‌ని మ‌న‌సు… కరోనా సోకిన గర్భిణి ప్రాణం కాపాడిన రియ‌ల్ హీరో

లారెన్స్ చ‌ల్ల‌ని మ‌న‌సు... కరోనా సోకిన గర్భిణి ప్రాణం కాపాడిన రియ‌ల్ హీరో

సాయం అంటే చాలు ఎగ‌బ‌డి వెళ్లిపోతాడు మ‌ల్టి టాలెంటెడ్ లారెన్స్. ఎవ‌రైనా క‌ష్టం అని అభ్యర్థిస్తే కన్నీళ్లు కార్చి వ‌దిలెయ్య‌డు. ఆ క‌ష్టం తీర్చ‌డానికి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతాడు. తాజాగా ఈ రియ‌ల్ హీరో తన ఔదర్యాన్ని చాటుకున్నాడు. కోవిడ్-19 సోకిన ఓ నిండు గర్భిణి ప్రాణాలను కాపాడటంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ విష‌యాన్ని అత‌డే సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. నిండు ప్రాణాల‌ను నిలబెట్టాన్న సంతోషం లారెన్స్ పోస్ట్ లో స్ప‌ష్టంగా క‌నిపించింది. “‌ఈ గుడ్ […]

Ram Naramaneni

|

May 03, 2020 | 2:45 PM

సాయం అంటే చాలు ఎగ‌బ‌డి వెళ్లిపోతాడు మ‌ల్టి టాలెంటెడ్ లారెన్స్. ఎవ‌రైనా క‌ష్టం అని అభ్యర్థిస్తే కన్నీళ్లు కార్చి వ‌దిలెయ్య‌డు. ఆ క‌ష్టం తీర్చ‌డానికి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతాడు. తాజాగా ఈ రియ‌ల్ హీరో తన ఔదర్యాన్ని చాటుకున్నాడు. కోవిడ్-19 సోకిన ఓ నిండు గర్భిణి ప్రాణాలను కాపాడటంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ విష‌యాన్ని అత‌డే సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. నిండు ప్రాణాల‌ను నిలబెట్టాన్న సంతోషం లారెన్స్ పోస్ట్ లో స్ప‌ష్టంగా క‌నిపించింది.

“‌ఈ గుడ్ న్యూస్ మీతో పంచుకోవాలి. రెండు రోజుల క్రితం నాకు తెలిసిన ఓ మహిళకు కరోనా వైరస్ పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఆమె అప్పుడు నెల‌లు నిండి..ప్ర‌స‌వానికి ద‌గ్గ‌ర్లో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆమె భర్త, మామ నాకు ఫోన్‌ చేసి సాయం అభ్య‌ర్థించారు. దీంతో ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్‌ పీఏ రవి సర్‌కు విష‌యం తెలియ‌జేశా. ఆయన వెంటనే స్పందించి.. గర్భిణిని కేఎమ్‌సీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు కరోనా వైరస్‌ ఉందని తెలుసుకున్నడాక్ట‌ర్లు అన్నీ జాగ్రత్తలు తీసుకుని.. శ‌స్త్ర‌చికిత్స‌ చేశారు. ఆమె మ‌గ‌బిడ్డ‌కు జన్మించింది. తల్లీ బిడ్డా ప్ర‌స్తుతం క్షేమంగా ఉన్నారు. కరోనాపై పోరాటం చేసి విజ‌యం సాధిస్తాన‌ని ఆమె నాకు మాటిచ్చింది. ఈ విషయంలో సాయం చేసిన హెల్త్ మినిస్ట‌ర్ కి, వైద్యులకు థ్యాంక్స్ తెలుపుతున్నా. మీరంతా దేవుళ్లతో సమానం” అని లారెన్స్ పోస్ట్ చేశాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu