Pushpa MASSive Pre Release Party: ఘనంగా ‘పుష్ప’ ప్రీరిలీజ్ ఈవెంట్.. భారీగా తరలి వచ్చిన అభిమానులు..

|

Dec 12, 2021 | 5:31 PM

సుకుమార్ క్రియేటివిటీకి బన్నీ మాస్ యాక్టింగ్ తోడైతే ఎలా ఉంటుందో.. డిసెంబర్ 17న చూడబోతున్నాం.. పుష్ప సినిమాకోసం బన్నీ ఆర్మీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pushpa MASSive Pre Release Party: ఘనంగా పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్.. భారీగా తరలి వచ్చిన అభిమానులు..
Pushpa
Follow us on

Pushpa MASSive Pre Release Party: సుకుమార్ క్రియేటివిటీకి బన్నీ మాస్ యాక్టింగ్ తోడైతే ఎలా ఉంటుందో.. డిసెంబర్ 17న చూడబోతున్నాం.. పుష్ప సినిమాకోసం బన్నీ ఆర్మీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమానుంచి విడుదలైన ఈ సినిమా పోస్టర్లు , టీజర్స్, సాంగ్స్ అన్నీ సినిమా పై అంచనాలను పెంచేశాయి. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇక ఊర మాస్‌లుక్‌ లో అడవిలో హంగామా చేసిన పుష్ప రాజ్‌ ట్రైలర్ చూసి బన్నీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. యూట్యూబ్‌ లో రికార్డు వ్యూస్‌ సాధింస్తుండడాన్ని చూసి హ్యాపీ గా ఫీలవుతున్నారు. అయితే ఈ ట్రైలర్ ను చూసి బన్నీ అభిమానులే కాదు.. టాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అలా తాజాగా హీరోయిన్ సమంత కూడా పుష్ప ట్రైలర్‌ చూసి ట్వీట్‌ చేశారు. ఇక ఇప్పటికే పుష్ప రాజ్‌తో ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పింది సామ్. అలాగే రీసెంట్ గా ఊ అంటావా ఊహు అంటావా మామ అనే పాటను కూడా విడుదల చేశారు. ఈ పాట సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తున్నవిషయం తెలిసిందే.. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పుష్ప’ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ.. సినిమా అంతా అదే ఉండదని తెలిపారు. ఇది హ్యూమన్ వాల్యూస్ – భావోద్వేగాలు కలబోసిన చక్కని అనుభూతినిచ్చే సినిమా అని పేర్కొన్నారు ఇటీవలే మేకర్స్ తెలిపారు. ఇక పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బన్నీ అభిమానులు భారీగా తరలి వచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hebah Patel: అందంతో ఆకట్టుకుంటున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)

Suma Kanakala: మెరిసిపోతున్న బుల్లితెర స్టార్ మహిళ సుమ.. ‘జయమ్మ’ లేటెస్ట్ ఫోటోలు..

Ankita Lokhande: పెళ్లి పీటలెక్కనున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. వైరల్‌గా ప్రి వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఫొటోలు..