
నూతన టెక్నాలజీతో కూడిన 108,104 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించిన సీఎం జగన్ పై డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచమంతా కోవిడ్-19తో పోరాడుతున్న వేళ ప్రజల కోసం ఇటువంటి కార్యక్రమాలు అమలుచేస్తున్న తీరు అద్బుతం అంటూ ట్వీట్ చేశారు. కాగా నేషనల్ డాక్టర్స్ డే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 1,088 అంబులెన్స్‌లను బుధవారం విజయవాడలో జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. అదే విధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ లో నాట్కో కేన్సర్ బ్లాక్‌ను స్టార్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితల్లో కూడా జగన్ సంక్షేమం పట్ల చూపిస్తోన్న శ్రద్దకు సంబంధించి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.
ఇక ఒకేరోజు 1,088 అంబులెన్సు సర్వీసు వాహనాలను ప్రారంభించడం పట్ల మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ తీరును అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు.