ఇలాంటి హీరోను ఇన్నాళ్లు ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యా.. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుంది

ఇటీవల పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా పూరి డైరెక్షన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం.. డైరెక్టర్ పూరి అయితే చాలు.

ఇలాంటి హీరోను ఇన్నాళ్లు ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యా.. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుంది
Puri Jagannadh

Updated on: Jun 20, 2026 | 10:06 AM

దర్శకుడు పూరి జగన్నాథ్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. మంచి అంచనాలతో విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతితో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు స్లామ్ డాగ్ అనే క్రేజీ టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో టబు, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ సినిమా పై అంచనాలు అమాంతం పెంచేసింది. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పూరిజగన్నాథ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తన చిత్రాలలో నటులతో పనిచేసే విధానంపై గతంలో మాట్లాడారు పూరి. తనతో పనిచేసే హీరోలు ఆయన్ను ఎందుకు ఇష్టపడతారో వివరించారు. తాను షూటింగ్‌లో నటులకు టెన్షన్ లేకుండా చూసుకుంటానని, కంఫర్ట్‌గా ఉంచి త్వరగా పని పూర్తి చేస్తానని పూరి తెలిపారు. పదేసి టేక్‌లు తీయకుండా, ఒకటి లేదా రెండు టేక్‌లలోనే సన్నివేశాలను పూర్తి చేస్తానని, సాయంత్రానికల్లా నటులను అలసిపోకుండా పంపించేస్తానని చెప్పుకొచ్చారు.

యూత్ హీరోలకే కాకుండా బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతోనూ ఆయన వర్కింగ్ స్టైల్ ఎంతగానో నచ్చిందని పూరి పేర్కొన్నారు. బాలకృష్ణ అయితే ఇంకా సింగల్ టేక్‌లో చేసేస్తారని ప్రశంసించారు. పైసా వసూల్ చిత్రం కోసం బాలకృష్ణతో పని చేసిన తర్వాత, “ఇన్ని సంవత్సరాలు ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యాను నేను” అని పూరి జగన్నాథ్ అన్నారు. ఒక వ్యక్తిగా బాలకృష్ణకు హ్యాట్సాఫ్ అని, ఆయన చిన్న పిల్లోడిలా వెరీ ప్లెయిన్, గొడవలు లేని వ్యక్తి అని అభివర్ణించారు. భవిష్యత్తులో మళ్ళీ బాలకృష్ణతో కలిసి సినిమా చేయాలని తాను కోరుకుంటున్నట్లు పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us