Naga Vamsi: ఆ రూమర్స్ అసలు నమ్మకండి.. ప్రొడ్యూసర్ నాగవంశీ ట్వీట్.. ఆ సినిమా గురించేనా.. ?

మూవీ ప్రచార కార్యక్రమాల్లో చిత్రయూనిట్ తో కలిసి సందడి చేసి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ విజయంతో ఫుల్ ఫాంలో ఉన్న నిర్మాత.. ఇప్పుడు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరలవుతుంది. ఇటీవల కొన్ని రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న రూమర్స్ అస్సలు నమ్మొద్దంటూ ప్రేక్షకులను విజ్ఞప్తి చేశారు. ఇంతకీ ఏ సినిమా ?అసలు ఏం జరిగింది? అనే విషయాలను తెలుసుకుందామా.

Naga Vamsi: ఆ రూమర్స్ అసలు నమ్మకండి.. ప్రొడ్యూసర్ నాగవంశీ ట్వీట్.. ఆ సినిమా గురించేనా.. ?
Naga Vamsi
Follow us

|

Updated on: Apr 17, 2024 | 4:52 PM

ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించారు. మూవీ ప్రచార కార్యక్రమాల్లో చిత్రయూనిట్ తో కలిసి సందడి చేసి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ విజయంతో ఫుల్ ఫాంలో ఉన్న నిర్మాత.. ఇప్పుడు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరలవుతుంది. ఇటీవల కొన్ని రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న రూమర్స్ అస్సలు నమ్మొద్దంటూ ప్రేక్షకులను విజ్ఞప్తి చేశారు. ఇంతకీ ఏ సినిమా ?అసలు ఏం జరిగింది? అనే విషయాలను తెలుసుకుందామా.

సూపర్ హిట్ జనతా గ్యారేజ్ తర్వాత మరోసారి ఆ హిట్ కాంబో రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా దేవర. ఇందులో బాలీవుడ్ తార జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈమూవీలో బీటౌన్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికీ రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ ఏడాది అక్టోబర్ 10న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.

అయితే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకునేందుకు ఇండస్ట్రీలోని పలు నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయని.. అందులో సితార ఎంటర్టైన్మెంట్స్ రైట్స్ కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ రూమర్స్ పై స్పందిస్తూ నాగవంశీ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. “సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అప్డే్ట్స్, ఫోటోలలో ఎలాంటి నిజం లేదు. మేం నిర్మించే, డిస్ట్రిబ్యూట్ చేసి సినిమాలకు సంబంధించిన విషయాలను మేమే అధికారికంగా ప్రకటిస్తాం.. కాబట్టి రూమర్స్ నమ్మకండి” అంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
హైప్ పెంచేస్తున్న పుష్ప రాజ్.. ఆ భాషలోనూ రిలీజ్ కానున్న సినిమా
హైప్ పెంచేస్తున్న పుష్ప రాజ్.. ఆ భాషలోనూ రిలీజ్ కానున్న సినిమా
ట్యాబ్లెట్స్‌ ఉపయోగించకుండానే.. నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు!
ట్యాబ్లెట్స్‌ ఉపయోగించకుండానే.. నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు!
కేకేఆర్ స్టార్ బౌలర్‌కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధంతో పాటు..
కేకేఆర్ స్టార్ బౌలర్‌కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధంతో పాటు..
ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
నల్లని, మెరిసే ఒత్తైన జుట్టు కోసం కలబందను ఇలా ఉపయోగించాలి
నల్లని, మెరిసే ఒత్తైన జుట్టు కోసం కలబందను ఇలా ఉపయోగించాలి
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన ముంబై.. డేంజరస్ బౌలర్ల రీఎంట్రీ
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన ముంబై.. డేంజరస్ బౌలర్ల రీఎంట్రీ
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
కాలేశ్వరం డ్యామేజ్ కు కారణం మీకు తెలుసా..?
కాలేశ్వరం డ్యామేజ్ కు కారణం మీకు తెలుసా..?
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.
ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే.!
ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే.!