ఆ హీరోకి నువ్వు పెద్ద స్టార్ అవుతావు అని ముందే చెప్పా.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు

మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఒక్కడులాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సంక్రాంతి రాజు గా పేరొందిన మెగా మేకర్ ఎం. ఎస్. రాజు దర్శకుడిగానూ ప్రతిభ చాటుతున్నారు. డర్టీ హరి లాంటి రొమాంటిక్ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే అగాధ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఆ హీరోకి నువ్వు పెద్ద స్టార్ అవుతావు అని ముందే చెప్పా.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు
Ms Raju

Updated on: Aug 26, 2026 | 10:01 AM

తెలుగు సినిమా పరిశ్రమలో మాట నిలబెట్టుకోవడం, నిబద్ధతకు కట్టుబడి ఉండటం చాలా అరుదు. అలాంటి విశిష్టమైన లక్షణాలను ఉన్న వారిలో నిర్మాత ఎం.ఎస్. రాజు ఒకరు. వర్షం సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌ను ఎలా మలుపు తిప్పారు. అలాగే ఒక్కడు సినిమాతో మహేష్ బాబుకు స్టార్ డమ్ అందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఎం.ఎస్. రాజుకు పరిశ్రమలోని టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌లతో పనిచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నా, ప్రభాస్ తండ్రి కృష్ణంరాజుకు ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. ఆ సమయంలో ప్రభాస్‌కు సరైన హిట్లు లేకపోయినా, ఆయనను నమ్మి వర్షం ప్రాజెక్టును మొదలు పెట్టారు. సినిమాకు సన్నాహాలు జరుగుతున్న వేళ, ప్రభాస్ స్వయంగా ఎం.ఎస్. రాజును ఇది రైటేనా బావ.?” అని అన్నారట.. అది ఆయనను తీవ్రంగా కలచివేసిందట. ఈ ప్రశ్న ప్రభాస్ ఉద్దేశం కాకపోయినా తనతో అలా అనడంతో మనస్తాపం చెంది, వర్షం చేయకూడదని నిశ్చయించుకుని ఇంటికి వెళ్లిపోయారట. ఆ తర్వాత రెండు, మూడు రోజుల పాటు ఎవరి ఫోన్‌లకూ స్పందించలేదట.

Jabardasth Naresh: మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు నాకు ఇచ్చేది ఎంతంటే

ఎం.ఎస్. రాజు తీవ్ర మనస్తాపంతో ఉన్నారని తెలుసుకున్న కృష్ణంరాజు, ఆయనకు ఫోన్ చేసి, ప్రభాస్ చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవద్దని కోరారు. ఆ తర్వాత ప్రభాస్ స్వయంగా ఎం.ఎస్. రాజు ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పాడట. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో, ఎం.ఎస్. రాజు భార్య ఆయనకు ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారట. “కృష్ణంరాజు గారి ముఖం చూసి, సూర్యనారాయణ రాజు గారి ముఖం చూసి ఈ విషయంలో ఏమీ అనవద్దు. అబ్బాయి చిన్నవాడు” అని చెప్పి, ఆయన్ను శాంతపరిచింది. ఆ తర్వాత ప్రభాస్‌ను కాఫీ, టిఫిన్ అడిగి, సినిమా చేద్దామని భరోసా ఇచ్చారట.

రూ. 65కోట్లు పెడితే.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు

వర్షం సినిమా నిర్మాణ సమయంలో, ప్రభాస్‌ను ఒక పూర్తిస్థాయి హీరోగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఎం.ఎస్. రాజు పనిచేశారు. సినిమాలో హీరో అంటే ఎలా ఉండాలి అనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో, ప్రభాస్‌ను ఒక మ్యాచో హీరోగా చూపించడానికి ఎన్నో రిస్క్‌లు తీసుకున్నారట. అప్పట్లో చెన్నైలో ల్యాండ్ మైన్స్‌ను పెట్టి, పీటర్ మాస్టర్‌తో కొండరామకృష్ణ గారి అనుభవాలను గుర్తు చేసుకుంటూ మైన్ సీక్వెన్స్ రూపొందించారు. రామోజీ ఫిలిం సిటీ నుంచి స్ట్రాడా క్రేన్‌ను చెన్నైకి తెప్పించి, బాంబులు పేలుతున్నప్పుడు కూడా భయపడకుండా ఉండే ఒక దృశ్యాన్ని చిత్రీకరించారు. ఈ సన్నివేశాలన్నీ ప్రభాస్‌ను ఒక ధైర్యవంతుడైన హీరోగా చూపించడానికి ఎంతగానో దోహదపడ్డాయి. ఈ కష్టమంతా చూసిన ప్రభాస్, సినిమా పూర్తయిన తర్వాత ఎం.ఎస్. రాజుతో “మీరు అవన్నీ మనసులో పెట్టుకోకండి, మళ్ళీ నాతో సినిమా చేయాలి” అని అడిగారు. అప్పటికే వారిద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడింది. ఎం.ఎస్. రాజు ప్రభాస్‌తో “నువ్వు పెద్ద స్టార్ అవుతావు, నీకు ఇది ఖైదీ లాంటి సినిమా” అని ముందే చెప్పారట. వర్షం విడుదలైన తర్వాత, ప్రభాస్ కెరీర్‌లో అది ఒక మైలురాయిగా నిలిచింది. రాజమౌళి, కృష్ణవంశీ వంటి దర్శకులు ఈ సినిమాను చూసి ప్రభాస్ నటనకు ప్రశంసలు కురిపించారు. వర్షంతో ప్రభాస్ స్టార్‌డమ్ పొంది, అక్కడి నుండి ఆయన ప్రస్థానం చరిత్రగా మారింది.

ఇవి కూడా చదవండి

ఆ హీరోలతో సినిమాలు చేయడం కష్టం.. నా వల్ల కాదు! ఓపెన్‌గా చెప్పేసిన తేజ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us