Shyam Singha Roy: సాయి పల్లవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్యామ్ సింగరాయ్ నిర్మాత.. ఏమన్నాడంటే..

డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. కలకత్తా బ్యాక్‏డ్రాప్‏లో

Shyam Singha Roy: సాయి పల్లవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్యామ్ సింగరాయ్ నిర్మాత.. ఏమన్నాడంటే..
Sai Pallavi

Updated on: Dec 28, 2021 | 10:46 AM

డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. కలకత్తా బ్యాక్‏డ్రాప్‏లో వచ్చిన ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్స్ సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో నాని, సాయి పల్లవి నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం నిన్న హైద్రాబాద్‏లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు నిర్మాత దిల్ రాజు, ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ హీరోయిన్ సాయి పల్లవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ.. ‘సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీడియా కూడా చాలా సపోర్ట్ చేసింది. దిల్ రాజు గారు, శిరీష్ గారు నా వెంటే ఉంటూ చేసిన సాయాన్ని మరిచిపోలేను. కరోనా లాక్డౌన్ సమయంలో ఎంతో కష్టపడి షూటింగ్ చేశాం. రాత్రి ఆరు గంటలకు ఇంట్లోకి వెళ్తే.. ఉదయం ఆరు గంటల వరకు కష్టపడేవారు. సాయి పల్లవి గారిని అయితే నిద్రపోనివ్వకుండా చేశాం. 45 రోజులు ఎంతో కష్టపడి చేశారు.

నాలుగైదు సినిమాలు మాన్పించి మరీ ఈ ప్రాజెక్ట్ కోసం అవినాష్ కొల్ల గారిని తీసుకున్నాం. ఆయనకు ఇలాంటి మరిన్ని గొప్ప చిత్రాలు వస్తాయి. నీరజ కోన గారు అద్భుతంగా పని చేశారు. జెర్సీ సమయంలో కెమెరామెన్ సాను గారిని చూశాను. ఆయన మంచి చిత్రాలనే సెలెక్ట్ చేసుకుంటారు. ఆయన మా సినిమాను ఎంచుకున్నప్పుడే నాకు నమ్మకం కలిగింది. ఆ రోజు నుంచి సినిమా ఆడుతుందనే నమ్మకం మాకు ఉంది. నవీన్ గారు అద్భుతంగా పని చేశారు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం బాగుంది. ఎన్ని సార్లు అడిగినా మా కోసం పని చేశారు. కృతి శెట్టి నటించిన ప్రతీ సినిమా హిట్ అవుతూనే ఉంది. శ్యామ్ సింగ రాయ్ రచనలు హీరో.. సమాజం అనేది విలన్. అదే సినిమా కథ. సాయి పల్లవి గారు కథ విన్న వెంటనే ఒప్పుకున్నారు. ఎప్పుడూ ఎక్కడా కూడా ఆలస్యం చేయలేదు. ఆమె తప్పా ఇంకెవ్వరూ ఈ పాత్రను చేయలేరు. ఆమె నాకు ఫ్యామిలీ మెంబర్. నాని గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది’ అని అన్నారు.

Also Read: RRR Movie: తారక్‌ ప్రేమను తట్టుకోవడం కష్టం, చరణ్‌లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. జక్కన్న ఆసక్తికర విషయాలు..

Mahesh Babu: దుబాయ్‌లో భీమ్లా నాయక్ టీమ్‌ని కలిసిన మహేష్ బాబు.. వర్క్ అండ్ చిల్ అంటూ ఫోటో షేర్ చేసిన ప్రిన్స్..

Singer Mangli: మంగ్లీకి సెల్పీల సెగ.. ఎగబడిన జనం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్…

Upasana Konidela: గోల్డెన్ వీసా అందుకున్న మెగా కోడలు.. ఇక పై గ్లోబల్ సిటిజన్‏గా గుర్తింపు.. సంతోషంలో ఉపాసన..

 

Loading...
Unable to load recommendations.
Follow Us