ఆ స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే అనుకున్నాం.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో దిల్ రాజు ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దిల్ రాజు. అలాగే ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే దిల్ రాజు గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఆ స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే అనుకున్నాం.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్
Dil Raju

Updated on: Feb 23, 2026 | 7:34 AM

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ హిట్ ప్రొడ్యూసర్‌గా పేరున్న దిల్ రాజు ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న విషయంతెలిసిందే . నిర్మాతగా బడా సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు దిల్ రాజు.  హీరోలకు సమానమైన క్రేజ్‌ను దక్కించుకున్న అతి కొద్ది మంది నిర్మాతాల్లో దిల్‌ రాజు ఒకరు. ఒకరకంగా చెప్పాలంటే ఏకైక వ్యక్తి కూడా దిల్‌రాజే అనడంలో సందేహం లేదు.  ఎన్నో భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన దిల్‌ రాజు టాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు సంపాదించుకున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. ఓ స్టార్ హీరో సినిమా గురించి ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

దిల్ రాజు తన గత సినిమా అనుభవాలను గుర్తు చేసుకుంటూ ప్రభాస్ మున్నా, చెలియా వంటి చిత్రాల విషయంలో ముందుగానే ఫలితాన్ని అంచనా వేసినట్లు తెలిపారు. తన ప్రింట్లను పంపించిన తర్వాత, డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి, సినిమా ఫ్లాప్. ప్రేక్షకులను నిరాశపరుస్తుందని చెప్పినట్లు పేర్కొన్నారు దిల్ రాజు. ఈ అనుభవాలు తనకు డిస్ట్రిబ్యూటర్ల పట్ల మరింత గౌరవాన్ని పెంచాయని ఆయన అన్నారు. పరిశ్రమలో 90 శాతం నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లే అని, సంవత్సరానికి విడుదలయ్యే 100 సినిమాల్లో 10-20 మాత్రమే విజయవంతమవుతాయని, మిగిలిన 80 సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారని ఆయన లెక్కలు చెప్పారు.

నిర్మాతలు విజయం వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు లాభాలు “తినేస్తున్నారని” భావిస్తారని, కానీ పరాజయాల వల్ల డిస్ట్రిబ్యూటర్లు తమ డబ్బు పోగొట్టుకున్నప్పుడు ఎవరూ ఆలోచించరని దిల్ రాజు అన్నారు. అందుకే తాను తన డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కోసం మహేష్ బాబు, వెంకటేష్ వంటి పెద్ద హీరోలను ఒప్పించి, వారి రెమ్యూనరేషన్లను తగ్గించుకునేలా చేయడం అదొక్కసారి మాత్రమే జరిగిందని, అది కథ డిమాండ్ చేయడం వల్లే సాధ్యమైందని అన్నారు. మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ జరగడానికి ప్రధాన కారణమని, ఆయన నేచురల్ గా ఉండే సినిమాను కోరుకున్నారని చెప్పారు. సినిమాల కోసం హీరోల ఎంపికపై మాట్లాడుతూ, ముందుగా స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతే హీరోను ఎంచుకుంటానని దిల్ రాజు తెలిపారు. ఒక హీరోకు నచ్చకపోతే వేరొక హీరో వద్దకు వెళ్ళే అవకాశం ఉంటుందని, కానీ స్టార్ హీరోలతో సినిమా చేయాలంటే ప్రభాస్ వంటి వారిని దృష్టిలో పెట్టుకుని కథను సిద్ధం చేయాల్సి ఉంటుందని దిల్ రాజు అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us