Quotation Gang: ఇదెక్కడి అరాచకం రా బాబు.. దండుపాళ్యం బ్యాచ్‏లా మారిన సన్నీలియోన్, ప్రియమణి.. చెమటలు పట్టించే సీన్..

ఇటీవల ఆహాలో భామకలాపంతో మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమాతో అలరించేందుకు రెడీ అయ్యింది. కానీ ఈసారి తన నటనతో ప్రేక్షకులకు చెమటలు పట్టిస్తుంది. కానీ ఈసారి ప్రియమణితోపాటు సన్నీ లియోన్ కూడా జత కట్టింది. వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా కొటేషన్ గ్యాంగ్.

Quotation Gang: ఇదెక్కడి అరాచకం రా బాబు.. దండుపాళ్యం బ్యాచ్‏లా మారిన సన్నీలియోన్, ప్రియమణి.. చెమటలు పట్టించే సీన్..
Quotation Gang Movie

Updated on: Jun 28, 2024 | 7:38 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు లేడీ ఓరియెటెండ్ కథలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా నటన ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలు చేసేందుకు ముందు ఉంటున్నారు. అందులో మొదటిగా వినిపించే పేరు ప్రియమణి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సినిమాల్లో కీలకరోల్స్ కాకుండా మహిళా ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తూ విలక్షణ నటనతో కట్టిపడేస్తుంది. ఇటీవల ఆహాలో భామకలాపంతో మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమాతో అలరించేందుకు రెడీ అయ్యింది. కానీ ఈసారి తన నటనతో ప్రేక్షకులకు చెమటలు పట్టిస్తుంది. కానీ ఈసారి ప్రియమణితోపాటు సన్నీ లియోన్ కూడా జత కట్టింది. వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా కొటేషన్ గ్యాంగ్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాతో అడియన్స్ కు చెమటలు పట్టించేందుకు సిద్ధమైపోయారు. ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అలాగే ఇందులోని నటీనటుల గురించి రివీల్ చేయలేదు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమాలో జాకీ షార్ఫ్, ప్రియమణి, సన్నీ లియోన్, సారా అర్జున్ వంటి స్టార్స్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రియమణి, సన్నిలియోన్ లుక్స్ చూశాక ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సన్నీ లియోన్ రా అండ్ రస్టిక్ లుక్స్ లో కనిపించింది. ఆ తర్వాత ప్రియమణి కూడా అదే తరహా లుక్ లో కనిపించింది. సినిమా మొత్తం గ్యాంగ్స్ వార్స్ నేపథ్యంలో అచ్చం దండుపాళ్యం సినిమాగా కనిపిస్తుంది. సుఫారీకి హత్యలు చేసే గ్యాంగ్ లో సన్నీ లియోన్, ప్రియమణి కూడా ఉంటారు. డబ్బు కోసమే వాళ్లు మనుషులను చంపుతుంటారు. అయితే ఓ బడా గ్యాంగ్ స్టర్ ను హత్య చేయడంతో వీరి జీవితాలు అనేక మలుపులు తిరుగుతాయి.

హత్యలు చేసే గ్యాంగ్ లో ప్రియమణి, సన్నీ లియోన్ యాక్టింగ్ ఇరగదీశారు. ఇన్నాళ్లు వెండితెరపై గ్లామరస్ బ్యూటీస్ గా కనిపించిన ఈ ఇద్దరు ఇప్పుడు భయంకరమై యాక్టింగ్ తో ప్రేక్షకులకు వణుకు పుట్టించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే నెలలో కన్నడ, హిందీ, మలయాళం,తెలుగు భాషలలో రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us