Pragya Jaiswal: లిప్ లాక్ గురించి ప్రశ్నించిన నెటిజన్.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్

కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు.

Pragya Jaiswal: లిప్ లాక్ గురించి ప్రశ్నించిన నెటిజన్.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్
Pragya Jaiswal

Edited By: Rajeev Rayala

Updated on: Jul 15, 2021 | 6:03 AM

Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు. కానీ అవేమి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయేయి. ఇక బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయాజానకి నాయక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆతర్వాత మళ్లీ ఈ ముద్దుగుమ్మ మరో సినిమాలో కనిపించలేదు. అయితే సినిమాలు చేయకాపోయినప్పటికీ ఈ అమ్మడు సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ప్రగ్యా. నటసింహం నందమూరి బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా సక్సెస్ పై ప్రగ్యా ఎన్నో ఆశలు పెట్టుకుందని తెలుస్తోంది. ముందు ప్రయాగా మార్టిన్‌, సాయేష సైగల్‌ లాంటి వాళ్లను ట్రై చేసిన మేకర్స్‌… ఫైనల్‌గా ప్రగ్యాను తీసుకున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అడపా దడపా సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ.

తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు అభిమానులతో ముచ్చటించింది. నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె పలు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. అయితే ఓ నెటిజన్ కొంటెగా మీరు డేటింగ్ కు వెళ్లిన మొదటిరోజే మీ పాట్నర్ తో లిప్ లాక్ ను ఇష్టపడతారా..? అని ప్రశ్నించాడు. దానికి ప్రగ్యా అదిరిపై ఆన్సర్ ఇచ్చింది. మొదటి రోజు డేటింగ్ లో ఎవరు కూడా లిప్ టూ లిప్ ముద్దులు పెట్టుకోరు. ఇద్దరి మద్య ప్రేమ ముదిరిన తర్వాత మాత్రమే ముద్దులు పెట్టుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది ప్రగ్యా జైస్వాల్. దాంతో నెటిజన్లు సూపర్ ఆన్సర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Actress Pragathi: పాపం ఎంత కష్టమొచ్చింది.. ట్రెడ్‏మిల్ పై నటి ప్రగతి వర్కవుట్స్ మాములుగా లేవుగా..

Rajini Kanth: “అన్నాతే” కంప్లీట్ చేయడానికి కోల్‏కత్తాలో అడుగుపెట్టిన రజినీ.. సూపర్ స్టార్ ఫైనల్ షెడ్యూల్..

Kathi Mahesh: కత్తి మహేష్ మృతి కేసులో మరో ట్విస్ట్.. టీవీ9తో ఆసక్తికర విషయాలు చెప్పిన కత్తి మహేష్ కారు డ్రైవర్