Prabhas: ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత మావ.!!

బాహుబలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 సినిమా కూడా సంచలన విజయం సాధించింది. అలాగే సాహో సినిమా కూడా భారీగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ప్రభాస్ నటించిన సినిమాల్ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి.

Prabhas: ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత మావ.!!
Prabhas
Follow us

|

Updated on: May 04, 2024 | 5:33 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 సినిమా కూడా సంచలన విజయం సాధించింది. అలాగే సాహో సినిమా కూడా భారీగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ప్రభాస్ నటించిన సినిమాల్ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి. ఇటీవలే సలార్ సినిమాతో సంచలన విజయం సాధించాడు డార్లింగ్. సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి 700కోట్ల వరకు వసూల్ చేసింది.

ప్రస్తుతం ప్రభాస్ వరుసగా బడా సినిమాలు చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అలాగే మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నారు. అలాగే సలార్ 2 సినిమా కూడా చేస్తున్నారు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఇదిగో ప్రభాస్ పెళ్లి, అదిగో ప్రభాస్ పెళ్లి అంటూ చాలా రకాల వార్తలు వస్తున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకుంటా అనే ప్రభాస్ కూడా చాలా సందర్భాల్లో తెలిపాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ ను ఓ అమ్మాయి రిజక్ట్ చేసిందట. అవును ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా..? అని యాంకర్ అడగ్గా.. ప్రపోజ్ చేశాను.. కానీ నన్ను రిజక్ట్ చేసింది అని చెప్పాడు ప్రభాస్. ఈవీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియోకి నెటిజన్స్ ప్రభాస్ అన్నకే తప్పలేదు మనం ఎంత అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

View this post on Instagram

A post shared by @bhimavaram__abbay

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.