Radhe Shyam: సంచారి సాంగ్ కు సూపర్ రెస్పాన్స్.. దూసుకుపోతున్న ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పాట..

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు.

Radhe Shyam: సంచారి సాంగ్ కు సూపర్ రెస్పాన్స్.. దూసుకుపోతున్న ప్రభాస్ రాధేశ్యామ్ పాట..
Prabhas

Updated on: Dec 17, 2021 | 8:03 AM

Radhe Shyam: ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అభిమానులకు సరికొత్త మ్యూజిక్ ఫీల్ ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలకు మంచి అప్లాజ్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి సంచారి సాంగ్ విడుదలయింది. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రేమను వెతుక్కుంటూ హీరో చేసే ప్రయాణమే ఈ పాట. ఇందులో అత్యద్భుతమైన విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రభాస్ చాలా అందంగా ఉన్నారు. ఇక ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇప్పటివరకు 2.6 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది ఈ పాట. ఇక జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్ నార్త్ వర్షన్స్ కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న రాధేశ్యామ్ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa Movie Twitter Reviews: బన్నీ వన్ మ్యాన్ షో.. అదిరిపోయిన పుష్ప

Pushpa Movie Release Live: మొదలైన పుష్ప రాజ్ బాక్సాఫీస్ వేట.. థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్న ఫ్యాన్స్..

AHA OTT: మరో సరికొత్త చరిత్రకు నాంది పలికిన ఆహా.. ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’తో ప్రేక్షకుల ముందుకు..

 

Loading...
Unable to load recommendations.
Follow Us