Radhe Shyam: రాధేశ్యామ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. అందుకే  ఆ స్పెషల్ షూట్ చేస్తున్నారా ? 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. బాహుబలి తర్వాత

Radhe Shyam: రాధేశ్యామ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. అందుకే  ఆ స్పెషల్ షూట్ చేస్తున్నారా ? 
Prabhas

Updated on: Aug 20, 2021 | 10:15 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. బాహుబలి తర్వాత డార్లింగ్ చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా లెవల్‏లోనే కావడంతో.. అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని షూటింగ్ దశలోనే ఉన్నాయి. కేవలం రాధేశ్యామ్ సినిమా మాత్రమే, షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తుండగా.. యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు. 1980లలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే రాధేశ్యామ్ సినిమా నుంచి అప్డేట్స్, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఆలస్యం అవుతుండటంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ పై ఒత్తిడి పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను 2022 జనవరి 14న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి సంబంధించిన మరో షూట్ పెండింగ్‏లో ఉందట. అయితే అందులో నటీనటులు ఉండరని.. కేవలం సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం మాత్రమే కొన్ని లోకేషన్స్ షూట్ చేయనున్నారట. అందుకు మేకర్స్ మూడు రోజుల షూటింగ్ ప్లాన్ చేసినట్లుగా టాక్. ఈమూవీతోపాటు.. ప్రభాస్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో అదిపురుష్ మూవీ చేస్తున్నాడు. అలాగే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు.

Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్ పుట్టినరోజున ఆచార్య మెగా అప్‏డేట్ రానుందా ?

Vivaha Bhojanambu: కడుపుబ్బ నవ్వేందుకు సిద్ధమవ్వండి అంటున్న వివాహ భోజనంబు టీం.. విడుదల ఎప్పుడంటే…

Nootokka Jillala Andagadu: నూటొక్క జిల్లాల అందగాడు నుంచి మరోసాంగ్.. ఆకట్టుకుంటున్న అలసిన సంచారి వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us