Ustaad Bhagat Singh Collections : బాక్సాఫీస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఊచకోత.. మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ అంటూ రివ్యూస్ అందుకుంది ఈ మూవీ. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురందర్: ది రివెంజ్ నుండి గట్టి పోటీని ఎదుర్కొంది.

Ustaad Bhagat Singh Collections : బాక్సాఫీస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఊచకోత.. మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే..
Ustaad Bhagat Singh

Edited By:

Updated on: Mar 20, 2026 | 3:55 PM

డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటేస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ’. భారీ అంచనాల మధ్య ఉగాది సందర్భంగా మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవర్ స్టార్ కాంబోలో సినిమా కావడంతో ఈ మూవీపై ముందు నుంచి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెల్లవారుజామున ఆటతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్ అందుకుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్, యాక్షన్ ఎంజాయ్ చేశామంటూ చెప్పుకొచ్చారు ఫ్యాన్స్. ఓవైపు బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్ 2’ పోటీని ఎదుర్కొంటూ ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమా.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

నివేదికల ప్రకారం పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం రూ. 31.5 కోట్ల వసూళ్లతో ప్రారంభమైంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం ఈ యాక్షన్ చిత్రం భారతదేశంలో రూ. 48 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. మొదటి రోజు మొత్తం ఆక్యుపెన్సీ 68.01% గా నమోదైంది. ఏపీలో రూ. 19.40 కోట్లు వసూలు కాగా ఆక్యుపెన్సీ 68.35% గా నమోదైంది. తెలంగాణలో రూ.9.10 కోట్లు రాబట్టింది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా, ఆర్ పార్థిబన్, అశుతోష్ రాణా , నవాబ్ షా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

Follow Us