
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. టాలీవుడ్ లో ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్. ఫ్యాన్స్‌కు ఆయన ప్రతి మూవీ ఒక ఫెస్టివల్ అనే చెప్పాలి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. గ్యాప్ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తున్నారు. ‘ఓజీ’ మూవీ రిలీజ్ కోసం మిగిలిన మూడు రోజులు మాత్రమే ఉన్నాయి. డైరెక్టర్ సుజీత్ రచన-దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్‌ను ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా చూపిస్తూ, సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ‘ఓజీ’ కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్ మాస్ ఎంటర్‌టైనర్. స్టైలిష్ ఫైట్స్, తమన్ మ్యూజిక్, ముంబై విజువల్స్ అన్నీ కలిపి ఫ్యాన్స్‌కు ఇదొక ఒక పండగలాంటి సినిమా..
టీజర్, ట్రైలర్స్ లోనే పవన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, డార్క్ మూడ్, ముంబై బ్యాక్‌డ్రాప్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ రివెంజ్ స్టోరీ, 1980ల ముంబై గ్యాంగ్‌స్టర్ వరల్డ్‌ను రీక్రియేట్ చేస్తూ, అడ్రెనలిన్ రష్ ఇస్తుందని తెలుస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘A’ (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమాలో 8 కట్స్ చేసి, మొత్తం 1 నిమిషం 55 సెకన్లు (115 సెకన్లు) తొలగించారని తెలుస్తుంది.
సినిమా రన్‌టైమ్ 154 నిమిషాలు (2 గంటలు 34 నిమిషాలు 15 సెకన్లు) లాక్ చేశారు. చివరిసారి 2011లో విడుదలైన ‘పంజా’ సినిమాకు ‘A’ రేటింగ్ వచ్చింది. సుజీత్ డైరెక్షన్‌లో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ‘ఓజీ’ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతుంది ఓజీ మూవీ. అలాగే ఈ సినిమాకు భారీ ఓపినింగ్స్ రావడం పక్కా అని అంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.