
Hara Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత కెరీర్ ఎన్నడూ లేనంత స్పీడ్ గా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. వీటిల్లో అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. ప్రతీ విషయం స్పెషల్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది.
ఈ పీరియాడికల్ డ్రామాలో.. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘హరిహర వీరమల్లు టైటిల్ తో పవన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ అలరించింది. పవన్ గెటప్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న క్రిష్.. అద్భుతమైన రూపాన్ని ఫైనల్ చేశాడని ప్రశంసలు వర్షం కురిపించింది.
అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హరి వీరమల్లు సినిమాకు సంబంధించిన ఓ మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాక్షన్ ఫైట్ కు సంబంధించి కొంతమంది మల్ల యోధులతో పవన్ పోరాటం చేస్తున్న వీడియో ఇది.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఇతర భాషల నటీనటులను తీసుకున్నారు. పవన్ సరసన.. నిధి అగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. చారిత్రక పరిస్థితులను కళ్లకు కట్టేందుకు చార్మినార్ తోపాటు గండికోట సంస్థానం సెట్ ను కూడా నిర్మిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు, విజువల్స్ ఫ్యాన్స్ ఊహలకు అందని స్థాయిలో ఉంటాయని ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే నిర్మాత భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవబోతున్న ఈ మూవీని.. ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్ రత్నందాదాపు 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారట. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
Also Read: ఒకే రోజులో ఏకంగా 11 గుడ్లు పెట్టి వార్తల్లో నిలిచిన బంగారు కోడి పెట్ట.. ఎక్కడంటే..