
ఇప్పుడు ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్ లో ఎక్కడ చూసిన రీ రిలీజ్ హంగామా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరోల పుట్టిన రోజులకు, స్పెషల్ డేస్ లో సూపర్ హిట్ సినిమాలను తిరిగి రీ రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు మేకర్స్. పోకిరి సినిమానుంచి మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు, తొలిప్రేమ, ఖుషి సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీగా కలెక్ట్ చేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో క్రేజీ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. పవన్ కళ్యాణ్ స్టైల్ , స్వాగ్ పర్ఫెక్ట్ ఎగ్జంపుల్ చెప్పాలంటే గుడుంబా శంకర్ సినిమా గురించే చెప్పాలి. ఇప్పుడు గుడుంబా శంకర్ మూవీ రీ రిలీజ్ కు రెడీ అవుతుంది.
2004లో రిలీజ్ అయిన గుడుంబా శంకర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన యువతను ఆకట్టుకుంది. ఆయన స్టైల్ కుర్రకారుకు పిచ్చేక్కించింది. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ రీ రిలీజ్ కు సిద్ధం అయ్యింది.
East Godavari theatres list of #GudumbaShankar.
Bookings open at 5 PM today. #GudumbaShankar4K #JanaSenaFundDrive pic.twitter.com/HGHWVPXSc2— PawanKalyan Fan (@PawanKalyanFan) August 23, 2023
త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు రానుంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఆ రోజు సంబరాలకోసం అభిమానులు సిద్ధం అవుతున్నారు. సోషల్ మీడియాలో పవన్ పేరు ట్రెండ్ చేయాలనీ గట్టిగా డిసైడ్ అయ్యారు ఫాన్స్. ఇదిలా ఉంటే గుడుంబా శంకర్ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ బుకింగ్ క్షణాల్లో అయిపోయాయి.
#GudumbaShankar4K Karnataka release by KINO cinemas.#GudumbaShankar #JanaSenaFundDrive pic.twitter.com/qtNARRd3kv
— PawanKalyan Fan (@PawanKalyanFan) August 23, 2023
గుడుంబా శంకర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన క్షణాల్లోనే పూర్తి కావడంతో ఈ సినిమా క్రేజ్ ఏంటో మరోసారి అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.
Stay tuned to @ChennaiPKFC 👍
Chennai Gudumba Shankar show details ⏳ pic.twitter.com/szTBWW6SuB
— ☮️🚶 (@Saiteja253) August 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..