Pawan Kalyan: దిగ్భ్రాంతి కలిగించింది.. రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్

శుక్రవారం (అక్టోబర్ 5) ఆమెకు గుండెపోటు వచ్చింది. దాంతో గాయత్రిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయత్రి ఈరోజు (అక్టోబర్ 6) కన్నుమూశారు.  కూతురు మృతితో రాజేంద్రప్రసాద్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Pawan Kalyan: దిగ్భ్రాంతి కలిగించింది.. రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్
Pawan Kalyan
Follow us

|

Updated on: Oct 05, 2024 | 12:10 PM

హాస్యనటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి (38) చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు. శుక్రవారం (అక్టోబర్ 5) ఆమెకు గుండెపోటు వచ్చింది. దాంతో గాయత్రిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయత్రి ఈరోజు (అక్టోబర్ 6) కన్నుమూశారు.  కూతురు మృతితో రాజేంద్రప్రసాద్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.

గాయత్రికి గుండెపోటు వచ్చిన సమయంలో రాజేంద్రప్రసాద్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రికి పరుగుపరుగున వచ్చారు. వైద్యులు తమ వంతు ప్రయత్నం చేశారు. అయినా గాయత్రిని కాపాడలేకపోయారు. గాయత్రి అంత్యక్రియలు రేపు (అక్టోబర్ 6) జరగనున్నాయి. రాజేంద్రప్రసాద్ నివాసానికి పలువురు ప్రముఖుల చేరుకొని ఆయనను పరామర్శిస్తున్నారు.

కొంతమంది సోషల్ మీడియా వేదికగా రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. ” నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.” ప్రముఖ నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. శ్రీమతి గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను” అని పవన్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.