
యానిమల్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్‌లో చూడనివారు ఈ వీకెండ్ ఈ సినిమాని చూసి మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. మన తెలుగు డైరెక్టర్ సందీప్ వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలసిందే. రష్మిక మందనా హీరోయిన్‌గా నటించింది. తండ్రీ కొడుకుల ఎమోషన్‌ను ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు డైరెక్టర్. మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ప్రజంట్ నెట్టింట ఓ ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా మూవీ ఓటీటీలోకి వచ్చిన వెంటనే అందులోని ప్రధాన అంశాలతో మీమ్స్ తెగ సర్కులేట్ చేస్తున్నారు క్రియేటర్స్. వాటిని మూవీ లవర్స్ బాగా లైక్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే యానిమల్ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫాదర్ ఎమోషన్‌తో వచ్చిన ఈ సినిమాలో ‘నాన్న’ అనే పదం చాలాసార్లు వినిపిస్తుంది. ఇప్పుడా నాన్న అనే పదం మొత్తం ఎన్ని సార్లు ఉపయోగించారో లెక్క తేల్చారు నెటిజన్లు. మొత్తం 196 సార్లు వాడినట్లు ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. సినిమా మొత్తంలో ఎన్నిసార్లు నాన్న పదం వాడారు? ఎప్పుడెప్పు వాడారు? వంటివి సీన్స్‌తో 1:26 నిమిషాల లెంగ్త్‌తో వీడియో ఉంది. హిందీ వర్షన్‌కు సంబంధించి ఈ వీడియోను కట్ చేశారు. ఇక తెలుగు డబ్బింగ్లోనూ ఇంచుమించు అన్ని సార్లే వాడి ఉండొచ్చని అంటున్నారు.
Animal PAPA count🏃♂️ pic.twitter.com/ppesnPMxGw
— Lok (@TeluguOchu) January 27, 2024
ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వీరాజ్ వంటి వాళ్ళు కీలక పాత్రల్లో కనిపించారు. అనిల్ కపూర్ తండ్రి పాత్రలో, బాబీ దేఓల్ విలన్ పాత్రలో నటించారు.