Sarke Chunar Song: పాటలో బూతు పదాలు.. దర్శకుడు చెప్పడం వల్లే రాశాను.. గీతా రచయిత కామెంట్స్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్న సాంగ్ సర్కే చునార్ తేరీ సర్కే. ఇందులోని అసభ్యకరమైన సాహిత్యం.. నోరా డ్యాన్స్ మూమెంట్స్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. అసలు ఇంత దారుణంగా ఒక సాంగ్ చేయాల్సిన అవసరం ఏముందంటూ చిత్రయూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై గీత రచయిత రఖీబ్ ఆలం వివరణ ఇచ్చారు.

Sarke Chunar Song: పాటలో బూతు పదాలు.. దర్శకుడు చెప్పడం వల్లే రాశాను.. గీతా రచయిత కామెంట్స్..
Nora Fatehi Sarke Chunar Song

Updated on: Mar 18, 2026 | 8:04 AM

బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి నటింటిన సర్కే చునార్ తేరీ సర్కే సాంగ్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ఈ పాటలోని అసభ్యకరమైన సాహిత్యం చూసి జనాలు షాకయ్యారు. అలాగే నోరా ఫతేహి డ్యాన్స్ మూమెంట్స్ సైతం మరింత జుగుప్సాకరంగా ఉండడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ పాటపై అలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ పాటను అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశించింది. దీంతో ఇప్పటికే హిందీ వెర్షన్ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు. మరోవైపు ఈ పాట సాహిత్యం పై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సర్కే చునర్ పాటకు హిందీలో లిరిక్స్ అందించిన గీత రచయిత రఖీబ్ ఆలం వివరణ ఇచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

ఈ పాటలోని లిరిక్స్ సొంతంగా రాయలేదని అన్నారు. కేవలం తాను కన్నడ నుంచి హిందీలోకి అనువదించానని అన్నారు. ముందుగా దర్శకుడు ప్రేమ్ కన్నడలో రాసిన సాహిత్యాన్ని యథాతథంగా హిందీలోకి మార్చాలని తనకు చెప్పారని అన్నారు. అందులో అసభ్యకరమైన పదాలు ఉన్నందుకు తాను మొదట ఈ పాట రాయడానికి నిరాకరించానని.. సెన్సార్ సమస్యలు వస్తాయని కూడా హెచ్చారించానని అన్నారు. కానీ ఆ టీమ్ వినకుండా ఒరిజినల్ వెర్షన్ నే అనువదించమని చెప్పారని.. దీంతో తాను కేవలం ట్రాన్స్ లేట్ మాత్రమే చేశానని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

అయితే పాటలోని సాహిత్యం అసభ్యకరంగా ఉందని తాను చాలా సార్లు చెప్పానని.. కానీ ఆ పాటను మద్యం సీసా గురించి వివరించామని దర్శకుడు చెప్పాడని అన్నారు. ఎన్నో పాటలు రాశాను. అప్పుడు రాని గుర్తింపు ఇప్పుడు ఇలాంటి వివాదల వల్ల వస్తోంది. ఈ పాట వల్ల నేను అభాసుపాలయ్యాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పాటపై విమర్శలు రావడంతో హిందీ వెర్షన్ ను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు సమాచారం.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

Loading...
Unable to load recommendations.
Follow Us