
Nithiin: టాలీవుడ్లో కరోనా థర్డ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. సెలబ్రీటిల నుంచి వారి కుటుంబాలు సైతం కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. నిన్న ఒక్కరోజే మహేష్ బాబు, మంచు లక్ష్మి కరోనా బారిన పడ్డారు. గత వారం మంచు మనోజ్‌కు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా మరో యంగ్ హీరో నితిన్ ఇంట్లోనూ కరోనా గుబులు మొదలైంది. నితిన్ సతీమణి శాలినికి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్లో వెల్లడించారు. కాగా.. శాలిని పుట్టినరోజు నాడే కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో నితిన్ ఆమెకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నువ్వు నెగిటివ్ కావాలని కోరుకుంటున్నానంటూ.. నితిన్ ఎమోషనల్ అవుతూ ట్విట్ చేశాడు. దీంతోపాటు నితిన్ శాలినికి వైరైటీగా బర్త్ డే విషెస్ తెలిపి.. తనపై ఉన్న ప్రేమను చాటారు. శాలిని ఐసోలేషన్ రూమ్ లో ఉండగా.. కింద నుంచి నితిన్ కేక్ కట్ చేసి ఆమెకి చూపిస్తూ బర్త్ డే వేడుకను చేశాడు. ఈ వీడియోను నితిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో..
Also Read: