sonu sood : సోనూసూద్ సాయం కోరుతూ నెల్లూరు జిల్లా కలెక్టర్ లేఖ.. స్పందించిన రియల్ హీరో..

|

May 17, 2021 | 1:06 PM

కష్టం వచ్చింది సాయం కావాళ్లన్న ప్రతి ఒక్కరికి లేదనకుండా ..కాదనకుండా సాయం అందిస్తున్నాడు సోనూసూద్. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ దగ్గరనుంచి  ఉంటూ ఎంతో మందికి సేవలు చేస్తూ..

sonu sood : సోనూసూద్ సాయం కోరుతూ నెల్లూరు జిల్లా కలెక్టర్ లేఖ.. స్పందించిన రియల్ హీరో..
Sonu Sood
Follow us on

sonu sood : కష్టం వచ్చింది సాయం కావాళ్లన్న ప్రతి ఒక్కరికి లేదనకుండా.. కాదనకుండా సాయం అందిస్తున్నాడు సోనూసూద్. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ దగ్గరనుంచి ఉంటూ ఎంతో మందికి సేవలు చేస్తూ ఆదుకుంటున్నాడు సోనూసూద్ వేల మంది వలస కార్మికులను తమ స్వగ్రామాలకు చేర్చి వారిచేత దైవంగా కొనియాడబడ్డాడు ఈ రియల్ హీరో. బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి కార్మికులను తమ గ్రామాలకు చేర్చి వారి కన్నీళ్లు తుడిచాడు. అంతటితో సోను సాయం ఆగిపోలేదు.  వేదికగా సాయం కోరిన ప్రతిఒక్కరికి తనవంతు సహాయం అందిస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశనలుమూలలనుంచి ఎవరు సాయం కోరిన  సోనూసూద్ చేస్తూ వచ్చారు. సోను పెద్ద మనసుకు ఎన్నో అవార్డులు.. దేశమంతటా ప్రశంసలు దక్కాయి.ప్రస్తుతం బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు సోనూసూద్ తన వంతు సహకారం అందిస్తున్నారు.

తాజాగా నెల్లూరు జిల్లాకు ఆక్సిజెన్ జనరేటన్ విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు రియల్ హీరో సోనూసూద్. నెల్లూరు జిల్లాలో ఆక్సిజెన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, ప్రజల ముప్పు ఉందని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూసూద్ కి లేఖ రాసారు. కలెక్టర్ లేఖకు స్పందించిన సోనూసూద్. 1.5 కోట్ల విలువైన ఆక్సిజెన్ జనరేటర్ ను అందిస్తానని హామీఇచ్చారు. ఈ జనరేటర్ రోజూ 2 టన్నుల ఆక్సిజెన్ ఉత్పత్తి కెపాసిటీ  కలిగి ఉంటుంది. మరో రెండు రోజుల్లో జిల్లాకు ఆక్సిజెన్ జనరేటర్ రానుంది. సోను సాయానికి నెల్లూరు జిల్లా ప్రజలతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Shruti Haasan: బాలయ్య సినిమాలో క్రాక్ హీరోయిన్.. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందంటున్నారే..

Nagarjuna: జూన్ నుంచి జోరు పెంచనున్న నాగార్జున.. శరవేగంగా కొత్త సినిమా షూటింగ్

Vijay Sethupathi : విజయ్ సేతుపతి బాలీవుడ్ సినిమాను అడ్డుకున్న కరోనా.. ఆగిపోయిన షూటింగ్ ..