Nayanthara: పిల్లలతో కలిసి ఆటోలో ప్రయాణించిన నయన్.. వైరల్ గా మారిన వీడియో

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తుంది నయన్. ఇటీవలే హిందీలో జవాన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ హిట్ తో పాటు భారీ కలెక్షన్స్ కూడా సాధించింది. ఇక నయనతార వ్యక్తిగత విషయానికొస్తే.. నయన్ కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.

Nayanthara: పిల్లలతో కలిసి ఆటోలో ప్రయాణించిన నయన్.. వైరల్ గా మారిన వీడియో
Nayanthara

Updated on: May 22, 2024 | 1:26 PM

స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం బడా హీరోల సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ మూవీతోనూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తుంది నయన్. ఇటీవలే హిందీలో జవాన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ హిట్ తో పాటు భారీ కలెక్షన్స్ కూడా సాధించింది. ఇక నయనతార వ్యక్తిగత విషయానికొస్తే.. నయన్ కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో నయన్ ఈ మధ్య బాగానే యాక్టివ్ గా ఉంటుంది పిల్లలకు సంబందించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే తాజాగా నయన్ షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది.

నయనతార తన పిల్లలతో కలిసి ఆటోలో ప్రయాణించారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఘా మారింది. నయన్ తన భర్త తో కలిసి ఇటీవలే చెన్నైలోని తిరుచెందూర్ మరియు కన్యాకుమారిలో ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఆమె ఓ ఆటోలో ప్రయాణించింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది నయన్.

నయన్ తన ఇన్ స్టార్ గ్రామ్ స్టోరీలో ఈ వీడియోను షేర్ చేసింది. ఎప్పుడూ కాస్ట్లీ కార్లలో తిరిగే నయనతార ఇలా పిల్లలతో కలిసి ఆటోలో ప్రయాణించడం పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మొన్నటివరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నయనతార పెళ్లి తర్వాత సోషల్ మీడియాలోకి అడుగు పెట్టింది. పిల్లలు పుట్టిన తర్వాత రకరకాల ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అటు నయన్ భర్త విగ్నేష్ కూడా సోషల్ మీడియాలో నిత్యం తన భార్య, పిల్లలకు సంబంధినైనా ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

నయనతార ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us