AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్10లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సపోర్టు ఎవరికో తెలుసా? అతని కోసం ప్రతిరోజూ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఉత్కంఠగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే పదో వారం ఎండింగ్ లోకి వచ్చేసింది. కాగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక కంటెస్టెంట్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అతని కోసమే జియో హాట్ స్టార్ ను ఇన్ స్టాల్ ఎక్కించి మరీ ఓట్లు వేయిస్తున్నారు.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్10లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సపోర్టు ఎవరికో తెలుసా? అతని కోసం ప్రతిరోజూ..
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Nov 15, 2026 | 11:32 AM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా, హోరా హోరీగా సాగుతోంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు పదో వారం వీకెండ్ కూడా వచ్చింది. ఇక దీపావళి పండగ సందర్భంగా గత వారం ఎవరూ హౌస్ నుంచి ఎలిమినేట్ కాలేదు. అయితే ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ వారం కెప్టెన్ టెంపర్ వంశీ మినహా అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ముఖేష్, వర్షిణి, సుధీర్, నీతూ మాస్టర్, దేబ్జానీ, రాంప్రసాద్, జబర్దస్త్ నరేష్, శ్వేతా, శివకుమార్, త్రిగుణ్, రామకృష్ణ ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. మరి వీరిలో ఎవరు బయటకు వస్తారన్నది మరికొన్ని గంటల్లో తెలియనుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో పదో వారం ఫ్యామిలీ వీక్ నడిచింది. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. తమ వారికి ధైర్యం చెప్పారు. అలాగే బిగ్ బాస్ టైటిల్ తో తిరిగి రావాలని కోరారు. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా కొందరు సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు.అందులో భాగంగానే ప్రముఖ స్టార్ కమెడియన్ ఆలీతోపాటు ఆయన సతీమణి జుబేదా కూడా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు.

ఈ సందర్భంగా అలీ ఒక ఆసక్తికర విషయం అందరితో పంచుకున్నారు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టెంపర్ వంశీకి ఫుల్ సపోర్టుగా ఉన్నారని పేర్కొన్నారు. ‘హాయ్.. వంశీ.. పూరీ జగన్నాథ్ గారు నీకోసం జియో హాట్ స్టార్ యాప్ ఎక్కించుకొని మరీ ప్రతిరోజు నీకు ఓటింగ్ వేస్తున్నారు’ అని చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేశారు అలీ. దీంతో ఈ విషయం కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మొత్తానికి ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్ గా ఉన్న వంశీకి పూరి జగన్నాథ్ నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తుందని చెప్పవచ్చు.

కాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం టెంపర్. 2015 లో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ఈ సినిమాలోనే విలన్ ప్రకాశ్ రాజ్ సోదరుగా నటించాడు వంశీ. ఇందులో అతని నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అందుకే టెంపర్ సినిఆ టైటిల్ నే తన ఇంటిపేరుగా మార్చుకొని టెంపర్ వంశీగా చెలామణి అవుతున్నారు. టెంపర్ ఒక్కటే కాదు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పైసా వసూల్, డబుల్ ఇస్మార్ట్ సినిమాల్లోనూ వంశీ విలన్ గా నటించాడు. ఆ సాన్నిహిత్యంతోనే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టెంపర్ వంశీకి సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us