Chiranjeevi’s Godfather: శరవేగంగా ‘గాడ్ ఫాదర్’ షూటింగ్.. షెడ్యూల్ కంప్లీట్ చేసిన లేడీ సూపర్ స్టార్

మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు.

Chiranjeevis Godfather: శరవేగంగా గాడ్ ఫాదర్ షూటింగ్.. షెడ్యూల్ కంప్లీట్ చేసిన లేడీ సూపర్ స్టార్
Lady Superstar Nayanthara

Updated on: Feb 17, 2022 | 2:58 PM

Godfather: మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ తోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. చిరుని చరణ్ ను కలిసి నటిస్తే చూడాలని మెగా ఫాన్స్ ఎప్పటినుంచో ఆశపడుతున్నారు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది. ఇక ఈ సినిమాలో చరణ్ చిరు ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఆచార్య తర్వాత మెగాస్టార్ వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాను తెలుగు గాడ్ ఫాదర్(Godfather) అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో నయన తార నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేశారట. ఇక నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతోపాటు మలయాళం లోనూ సినిమాలు చేస్తున్నారు. చిరుతో ఇప్పటికే సైరా సినిమాలో నటించిన నయన్.. ఇప్పుడు మరోసారి గాడ్ ఫాదర్ సినిమాలో ఆకట్టుకోనుంది. హైదరాబాదులో నయనతారకి సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ ను తాజాగా పూర్తి చేయడం జరిగిందని దర్శకుడు మోహన్ రాజా ట్వీట్ చేశాడు. నయనతారతో కలిసి మూడో సినిమాకి వర్క్ చేసే అవకాశం కలగడం తనకి చాలా ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sreemukhi: మెస్మరైజ్ చేస్తున్న శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే

ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్స్ ధరలపై కమిటీ కీలక నిర్ణయం.. వారం రోజుల్లోనే ప్రభుత్వం నుంచి..

Priyamani: పరువాలతో మైమరిపిస్తున్న ప్రియమణి లేటెస్ట్ శారీ పిక్స్ వైరల్

Loading...
Unable to load recommendations.
Follow Us