500కు పైగా సినిమాలు.. జాతీయ అవార్డు విన్నర్.. ఏడు పదుల వయసులో పదో తరగతి పరీక్షలు.. ఈ నటుడు గ్రేట్ కదా

సాధారణంగా ఓ ఉద్యోగం లేదా ఏదైనా పనిలో స్థిరపడ్డాక మళ్లీ పుస్తకం పట్టుకోవాలనిపించదు. చదువుకోవడానికి టైమ్ ఉండవు. ఒకవేళ సమయం ఉన్నా ఏకాగ్రత ఉండదు. అలాంటిది 68 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్షలు రాసేందుకు రెడీ అయ్యారు ఓ సీనియర్ నటుడు.

500కు పైగా సినిమాలు.. జాతీయ అవార్డు విన్నర్.. ఏడు పదుల వయసులో పదో తరగతి పరీక్షలు.. ఈ నటుడు గ్రేట్ కదా
Actor

Updated on: Apr 21, 2026 | 12:25 PM

ఇంద్రాన్స్.. తెలుగు ప్రేక్షకులకు ఈ నటుడి పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు.. కానీ. మలయాళం డబ్బింగ్ సినిమాలు చూసే వారు ఈ నటుడిని ఈజీగా గుర్తు పట్టేస్తారు. ముఖ్యంగా 2018 సినిమాలో ఇంద్రాన్స్ యాక్టింగ్ ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. 1981లో ‘చూతట్టం’ అనే సినిమాతో మలయాళ సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు ఇంద్రాన్స్. ఈ సినిమాలో నటించడమే కాకుండా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గానూ పని చేశారు. ఆ తర్వాత ‘సీఐడీ ఉన్నికృష్ణన్‌ బీఏ, బీఎడ్‌’ సినిమాతో పాపులర్‌ అయ్యారు. కమెడియన్‌గా వందలాది చిత్రాల్లో నటించాడు. ఇక 2021లో హోమ్‌ సినిమాకుగానూ జాతీయ అవార్డు సైతం అందుకున్నారు ఇంద్రాన్స్. కాగా విశ్రాంతి తీసుకునే వయసులో ఓ వైపు సినిమాలు చేయడంతో పాటు మరోవైపు పాఠశాలకు హాజరవుతున్నారు ఇంద్రాన్స్. పదో తరగతి పరీక్షల కోసం ప్రతి ఆదివారం స్పెషల్ క్లాసులకు హాజరవుతున్నాడట. కాగా తన మొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్న తర్వాత తన చదువుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట ఇంద్రాన్స్. పేదరికం కారణంగా చిన్నతనంలో మధ్యలోనే ఆపేసిన విద్యను పూర్తి చేయాలని అనుకున్నారట. అలా కేరళ రాష్ట్ర అక్షరాస్యతా మిషన్ అథారిటీ నిర్వహించిన 7వ తరగతి పరీక్షలు రాసేశారట. కాగా ఇంద్రాన్స్ మొదట నేరుగా పదో తరగతి పరీక్షలు రాయాలనుకున్నారట. అయితే అది సాధ్యపడలేదట. ఎందుకంటే కేరళలో 7వ తరగతి లేదా అందుకు సమానమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి, సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతి ఉంటుంది. ఈ కారణంగానే ఏడో తరగతి పూర్తి చేసిన ఇంద్రాన్స్ ఇప్పుడు పదో తరగతి కూడా పూర్తి చేసేందుకు రెడీ అయ్యారు.

‘నా పాఠశాల విద్య, బాల్యం అంతా తిరువనంతపురంలోని కుమారపురంలోనే గడిచాయి. నేను చదువులో చురుగ్గా ఉండే వాడిని. మొదటి ర్యాంకు సాధించేవాడిని. ఆ రోజుల్లో, ప్రతిభావంతులైన విద్యార్థులను ముందు వరుస బెంచీలలో కూర్చోబెట్టేవారు. అందుకే నేను ఎప్పుడూ ఫ్రంట్ బెంచ్ విద్యార్థినే. కానీ నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు యూనిఫాం ఒక సమస్యగా మారింది. ఆ సంవత్సరం మొత్తం నేను బడికి వెళ్ళలేదు. మరుసటి సంవత్సరం, పుస్తకాలు, యూనిఫాం రెండూ కలిపి కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు. పాఠశాల యూనిఫాంలను తప్పనిసరి చేసింది. అలా నేను నా చదువును ముగించాల్సి వచ్చింది. మా ఇంట్లో ఏడుగురు పిల్లలం, నేను మూడో వాడిని’ అంటూ అప్పటి పరిస్థితులను గుర్తుకు తెచ్చుకున్నాడు ఇంద్రాన్స్.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘పేట్రియాట్’ అనే సినిమాలో నటిస్తున్నారు ఇంద్రాన్స్. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మమ్ముట్టి, మోహన్‌లాల్ హీరోలుగా నటిస్తున్నారు.

ఇంద్రాన్స్ ఫొటోస్..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us